Breaking News

గొలుసు ఉత్తరం..

Published on Sun, 07/05/2026 - 09:22

ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్‌ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్‌ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్‌మెంట్లో అతని మెయిల్‌ బాక్స్‌లో అరుదుగా ఉత్తరాలు పడుతూంటాయి. చిట్‌ఫండ్‌ కంపెనీ ఇంటిమేషన్, ఎల్‌.ఐ.సి. రసీదులు, రిమైండర్స్, నవరాత్రులలో పూజకి డబ్బు పంపమని అతని గ్రామ పూజారి నుంచి ప్రింటెడ్‌ బ్రోచర్‌ లాంటివి.

ఆరోజు అతను ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చాక, అలవాటుగా తన మెయిల్‌ బాక్స్‌ ట్రా¯Œ ్సపరెంట్‌ అద్దం తలుపులోంచి చూస్తే లోపల ఓ కవర్‌ కనిపించింది. తాళం తెరిచి దాన్ని తీసుకుని చూశాడు. అది ఐదు రూపాయల పోస్టల్‌ కవర్‌. ఫ్రమ్‌ అడ్రస్‌ లేదు. టు అడ్రస్‌ అందమైన చేతిరాతలో ఉంది.

అతను దాన్ని తీసుకుని లిఫ్ట్‌లో ఆరో అంతస్తులోని తన అపార్ట్‌మెంట్‌కి చేరుకుని దాన్ని బల్ల మీద పడేశాడు. రాత్రి పడుకోబోయే ముందుదాకా అతని దృష్టి దాని మీద పడలేదు. పడుకోబోయే ముందు దాన్ని అందుకుని చింపి చదివాడు. అది చేతిరాతలో ఉన్న ఓ హెచ్చరిక. ఆ ఉత్తరాన్ని అది చదివిన 24 గంటల్లోగా మొత్తం కాపీ చేసి కనీసం ఒకరికి పంపాలని, దాన్ని కాపీ చేసి పంపకపోతే ఒకతని భార్య ఆత్మహత్య చేసుకుందని, మరొకరికి ఆస్తి నష్టం వచ్చిందని, కాబట్టి ఆ చై¯Œ ని బ్రేక్‌ చేయొద్దని దాని సారాంశం. అందులో షిరిడీ బాబా చెప్పిన పన్నెండు బోధనలు ఉన్నాయి.

జాగృత్‌ కొలిచేది ఒక్క షిరిడీ సాయినే. ప్రతి ఉగాదికి షిరిడీకి వెళ్తాడు. ప్రతి నవరాత్రులలో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర చదువుతాడు. అయితే అతనిది మూఢ భక్తి కాదు. దేన్నయినా హేతువాదంతో ఆలోచిస్తాడు. తను ఆ చై¯Œ ని బ్రేక్‌ చేస్తే ఆపద వాటిల్లుతుందని జాగృత్‌ క్షణకాలం కూడా నమ్మలేదు. ఓ మనిషికి కీడుని కలిగించే గొప్ప శక్తి ఆ గొలుసు ఉత్తరానికి ఉండదని అతని స్థిరనమ్మకం.

అయినా, జాగృత్‌ కాగితం, కలం తీసుకుని ఆ ఉత్తరాన్ని కాపీ చేశాడు. అందుకు కారణం, కొత్తవాళ్ళకి ఆ ఉత్తరం అందితే వారి దృష్టిని తను కొలిచే సాయి మీదకి మళ్ళించినవాడు అవుతాడు. వాళ్ళు సాయి భక్తులు కాకపోతే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో దాన్ని కాపీ చేశాడు.

మర్నాడు దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్ళాడు. అది ఎవరికి పంపాలా అని ఆలోచించాడు. లంచ్‌ అవర్‌లో అతను తిరిగి తన సీట్‌కి వస్తూంటే, ఆ మల్టీస్టోరీడ్‌ కమర్షియల్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌ లోని ఓ ఆఫీస్‌ తలుపు బయట ఆ కంపెనీ ఫైనాన్షియల్‌ మేనేజర్‌ పేరు కనిపించింది. జాగృత్‌ తన సీట్‌కి వెళ్ళాక ఆఫీస్‌ కవర్‌ తీసుకుని, ఆ కవర్‌ మీద అతని పేరు, డిజిగ్నేషన్, అతని ఆఫీస్‌ చిరునామా రాశాడు. మధ్యాహ్నం మూడున్నరకి  బాత్‌రూమ్‌కి వెళ్ళడానికి లేచినప్పుడు డిస్పాచ్‌ క్లర్క్‌కి ఆ కవర్‌ ఇచ్చి చెప్పాడు.
‘‘దయచేసి దీన్ని పోస్ట్‌ చెయ్యి.’’
జాగృత్‌ ఆ సంగతి అంతటితో మరిచిపోయాడు.
∙∙ 
కొన్ని వారాల తర్వాత జాగృత్‌ దగ్గరకి ఓ కొత్త వ్యక్తి వచ్చి తన విజిటింగ్‌ కార్డ్‌ ఇచ్చి అడిగాడు.
‘‘ఈ ఆదివారం ఫ్రీగా ఉంటారా?’’
‘‘ఏమిటి విశేషం?’’ అతను అడిగాడు.
‘‘ఈ ఆదివారం మా ఇంట్లో సాయి భజన జరుగుతుంది. ఎందుకో మిమ్మల్ని పిలవాలని అనిపించింది.’’
‘‘నేను సాయి భక్తుడిని. తప్పకుండా వస్తాను. లొకేషన్‌ షేర్‌ చేయండి.’’ జాగృత్‌ చిరునవ్వుతో అంగీకరించాడు.
‘‘నెహ్రూ నగర్లో ఇండియన్‌ బ్యాంక్‌ తెలుసుగా. దాని పక్కన ఫస్ట్‌ ఫ్లోర్‌. కాబట్టి తేలిగ్గా రాగలరు.’’
జాగృత్‌ ఆదివారం కొబ్బరికాయ, పూలున్న కేరీ బ్యాగ్‌తో ఆ ఇంటికి చేరుకున్నాడు.
‘‘ఇంకా ఎవరూ రాలేదు. ఐదు నిమిషాల్లో అంతా ఇక్కడ ఉంటారు. ఈలోగా మీరు దీన్ని తాగండి. అందరికీ కలిపాను.’’

జాగృత్‌ రూహఫ్జా తాగాక అతను చెప్పాడు.
‘‘మీరో ఘోరమైన పొరపాటు చేశారు.’’
‘‘పొరపాటా? నేనా? ఏమిటది?’’ జాగృత్‌ ఆశ్చర్యంగా అడిగాడు.
అతను జాగృత్‌ పంపిన గొలుసు ఉత్తరాన్ని చూపించాడు.
‘‘ఇదే మీరు చేసిన ఘోరమైన పొరపాటు.’’
‘‘ఏం పొరపాటు?’’ జాగృత్‌ అర్థం కాక అడిగాడు.
‘‘నేను ఒరియావాడిని. నాకు తెలుగు చదవడం వచ్చి, అప్పుడే దీన్ని చదివి ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ ఉత్తరాన్ని కాపీచేసి పంపేవాడిని. కాని నిన్నటి దాకా ఇందులో ఏముందో నాకు తెలీదు. నిన్న మా ఇంటికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ బంధువు చదివి చెప్పారు. ఇది అందిన నాలుగో రోజున నా భార్య ఆత్మహత్య చేసుకుంది.’’

‘‘అయ్యో. ఐ యాం వెరీ సారీ.’’
‘‘ఆ తర్వాత రెండు రోజులకి ఊళ్ళోని మా ఉమ్మడి ఆస్తిలోంచి నా జ్ఞాతులు నా భాగాన్ని కొట్టేశారు.’’
‘‘అరెరే.’’
‘‘నన్ను నా మానాన బతకనివ్వకుండా నువ్వు అనవసరంగా నా జీవితంలో జోక్యం చేసుకున్నావు. ఈ ఉత్తరం ద్వారా నాకు నష్టాన్ని కలిగించావు.’’ అతను కోపంగా చెప్పాడు.
‘‘కాదు. నేను దీన్ని నమ్మలేదు. సరదాకి దీన్ని పంపాను. ఈ ఉత్తరానికీ, మీకు జరిగిన నష్టాలకి ఎలాంటి సంబంధం లేదు. హేతువాదంతో ఆలోచించండి.’’

‘‘నాకు జరిగిన నష్టాలకి నేను ఆవేదనతో కుమిలిపోతూండగా, ఈ ఉత్తరం నువ్వు పంపావని తెలిసి నా మనసు కుతకుతలాడిపోతోంది. కవర్‌ మీద నీ ఆఫీస్‌ ఎడ్రస్‌ పైన కేరాఫ్‌ అని నీ పేరు రాసి ఉండటంతో నిన్ను తేలిగ్గా కనుక్కున్నాను. అందుకే భజన నెపంతో నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు తాగిన రూహఫ్జాలో విషం ఉంది. ఇంకో పావుగంట తర్వాత నువ్వు జీవించవు.’’
డిస్పాచ్‌ క్లర్క్‌ కవర్‌ మీద తన పేరు రాసి ఉంటాడని స్పృహ తప్పేముందు జాగృత్‌కి తోచింది. - మల్లాది వెంకట కృష్ణమూర్తి
 

  • ‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)