సుమో దీదీ బయోపిక్‌

Published on Fri, 10/30/2026 - 00:32

లావుగా ఉన్న శరీరాన్నిఆమె అవమానంగా భావించలేదు. ఆయుధం చేసుకుంది. ముంబై స్లమ్స్‌లో పుట్టి పెరిగిన హెతల్‌ దవే తన స్థూలకాయం వల్ల మాటలు పడింది.  అవమానాలు మోసింది. కాని ఆ శరీరాన్ని ఆమె సుమో రెజ్లింగ్‌ కోసం తీర్చిదిద్దడమే కాదు జపాన్‌ వరకూ వెళ్లి సుమోలతో కలబడింది.  గెలిచింది. ఆమె కథ ఇప్పుడు ‘సుమో దీదీ’ బయోపిక్‌గా స్ట్రీమ్‌ అవుతూ బాడీ షేమింగ్‌కు గుణపాఠంగా నిలిచింది.

ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ఒకే మాట వింది... ‘ఏయ్‌... మోటీ’... అంటే ‘లట్టు దానా’ అని అర్థం. ఆమెకో పేరు ఉంది. హెతల్‌. కాని ఆ పేరు పిలిచేవారే లేరు. ‘మోటీ.. మోటీ’... తనంటే తన శరీరమేనా? ఈ శరీరానికి మించిన గుర్తింపు తను తెచ్చుకోలేదా అనుకుంది హెతల్‌. ఆ తర్వాత ఆమె సుదీర్ఘ ప్రయాణం నేటి బయోపిక్‌ వరకూ కొనసాగింది.

వార్తల్లో బయోపిక్‌
‘సుమో దీదీ’ ఇదీ సినిమా పేరు. అది జనం బాడీ షేమింగ్‌ చేస్తూ పెట్టిన పేరు కాదు. సుమోలో విజయం సాధించినందుకు హెతల్‌ దవేను ప్రేమగా పిలుచుకునే పేరు. అదే ఆమె సినిమాకు టైటిల్‌ అయ్యింది. నిజానికి వెండితెరపై క్రీడాకారుల బయోపిక్‌లు రావడం కొత్తేమీ కాదు. కానీ ముంబై స్లమ్స్‌ అమ్మాయి, అసలు మన దేశంలో ఉనికిలోనే లేని ‘సుమో రెజ్లింగ్‌’లో ప్రపంచ వేదికపై దేశం తరఫున నిలబడటం... అదీ జర్నీ అంటే.  మూడు నాలుగు రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం గత 
24 గంటలుగా దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఇన్సి్పరేషనల్‌ స్టోరీగా నిలిచింది.

స్లమ్స్‌ అమ్మాయి
ముంబైలోని స్లమ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో పెరిగిన హెతల్‌కు చిన్నప్పటి నుంచి జూడో, మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఇష్టం. అయితే ఆమె శరీర ఆకృతి, బరువుపై చాలా జోకులు ఎదురయ్యేవి. ‘అమ్మాయివి... మార్షల్‌ ఆర్ట్స్‌లోకి వెళతావా? అసలు  లావుగా ఉంటే పెళ్లెలా అవుతుంది? ముందు ఆ సంగతి చూసుకో’ అన్న బాడీ షేమింగ్‌ చుట్టుముట్టింది. కానీ హెతల్‌ ఆ అవహేళనలను ఎదుర్కోవాలనుకుంది. 

ఇంటర్‌నెట్‌ కేఫ్‌లో కూచుని నా శరీరానికి తగ్గ ఆట ఏమిటి అని అడిగితే సుమో రెజ్లింగ్‌ అని వచ్చింది. అయితే ఎన్నో సందేహాలు. సుమోలో స్త్రీలు ఉన్నారా... జపాన్‌ వారితో తాను పోటీ పడొచ్చా... అన్నీ మెయిల్స్‌ రాసి సందేహాలు తీర్చుకోవడమే. చివరకు అదే తన మార్గం అని నిశ్చయించుకుంది. అయితే మన దేశంలో సుమో రెజ్లింగ్‌కు అసోసియేషనే లేదు, కోచ్‌లు లేరు, కనీసం ప్రాక్టీస్‌ చేయడానికి సుమో రింగ్‌ (దోహ్యో) కూడా లేదు. ఒక పక్క సమాజం మాటల తూటాలు విసురుతుంటే, మరోపక్క వనరులు లేని శూన్యంలో హెతల్‌ తన ఒంటరి పోరాటం ప్రారంభించింది.

జపాన్‌ రింగ్‌లో త్రివర్ణ పతాకం
‘మొదట మా అన్న తర్వాత మా నాన్న తోడుగా నిలిచారు’ అంటుంది హెతల్‌. ఆమె పెళ్లికి దాచిన కొద్ది పాటి బంగారాన్ని తండ్రి అమ్మేసి ‘నీ శిక్షణకు ఈ డబ్బువాడు’ అన్నాడు. అన్న ముంబైలోని ఓవల్‌ మైదాన్‌లోనే ఆమెకు రింగ్‌ ఏర్పాటు చేసి ఇంటర్‌నెట్‌ చూస్తూ తనే కోచ్‌గా మారాడు. దాంతో హెతల్‌ పురుషుల ఆధిపత్యం, కఠినమైన సాంప్రదాయాలు ఉండే సుమో రింగ్‌లోకి సింహంలా దూకింది. 

మెల్లమెల్లగా జపాన్‌ సంప్రదాయాలను ఔపోసన పట్టి, సరైన స్పాన్సర్‌షిప్‌ లేకపోయినా తన సొంత ఖర్చులతో అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు వెళ్ళింది. 2008లో జరిగిన ప్రపంచ సుమో పోటీలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఏకంగా ప్రపంచ ఐదో ర్యాంకు సాధించి గ్లోబల్‌ రికార్డు సృష్టించింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సమాజం దేన్నయితే బలహీనత అందో, దాన్నే తన గ్లోబల్‌ సక్సెస్‌గా మార్చి చూపించింది.

స్క్రీన్‌ పైకి ‘సుమో దీదీ’
హెతల్‌ దవే సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని అంతే సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు జయంత్‌ రోహత్గీ. ఈ బయోపిక్‌లో హెతల్‌ పాత్రను పోషించే బాధ్యతను బాలీవుడ్‌ నటి శ్రియమ్‌ భగ్నాని తీసుకుంది. గ్లామర్‌ పాత్రలకు భిన్నంగా ఒక సుమో రెజ్లర్‌ బాడీ లాంగ్వేజ్‌ను మ్యాచ్‌ చేయడం శ్రియమ్‌కు అతి పెద్ద సవాలుగా మారింది. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా 14 కేజీల బరువు పెరిగింది. కేవలం బరువు పెరగడమే కాకుండా, నెలల తరబడి ప్రొఫెషనల్‌ సుమో శిక్షకుల వద్ద కఠినమైన రెజ్లింగ్‌ పద్ధతులు, సుమో ఫైట్‌ సీక్వెన్స్ లు నేర్చుకుంది. స్క్రీన్ పై శ్రియమ్‌ పడే ప్రతి కష్టం, రియల్‌ లైఫ్‌ హెతల్‌ పడ్డ శ్రమను కళ్లకు కట్టేలా చేసింది.

‘సుమో దీదీ’ కేవలం ఒక క్రీడాకారిణి బయోపిక్‌ మాత్రమే కాదు... అది ప్రతి అమ్మాయి ఆత్మగౌరవ ప్రయాణం. బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటూ, సమాజం గీసిన గీతలను దాటాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కథ ఒక టార్చ్‌ లైట్‌. ఓటీటీలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అస్సలు మిస్‌ అవ్వకూడని ‘మస్ట్‌ వాచ్‌’ ఫీచర్‌ స్టోరీ ఇది!

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)