Breaking News

Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

Published on Tue, 05/07/2024 - 12:23

ఎండాకాలంలో  ఎండలు, వర్షాకాలంలో వర్షాలు  ప్రకృతి సహజం. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా మన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి.  ముఖ్యంగా చెమట రూపంలో నీరు ఎక్కువ నష్టపోతాం  కాబట్టి, నీరు ఎక్కువగా లభించే పండ్లు కూరగాయలు  తీసుకోవాలి. ఈ క్రమంలో సమ్మర్‌లో కీరదోసకాయను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. 

నిజానికి కీరదోస ఏ సీజన్‌లో తీసుకున్నా మంచిదే. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. వేసవిలో అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  దోసకాయలు కేలరీలు తక్కువ. విటమిన్లు , ఖనిజాలు ఎక్కువ. కరిగే ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది.

కీరదోసతో లాభాలు
హైడ్రేషన్ & డిటాక్సిఫికేషన్ కోసం మంచిది
రక్తపోటును నియంత్రిస్తుంది
జీర్ణక్రియకు మంచిది
బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది
బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది
మెరుగైన చర్మం కోసం
కళ్లకు సాంత్వన చేకూరుస్తుంది
కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో 95 శాతం నీటితోపాటు, పొటాషియం,మెగ్నీషియం లభిస్తాయి. సోడియం లోపం ఉన్నవారు ఆహారంలో ఈ కీర దోసకాయని తీసుకుంటే మంచిది. పొట్టుతో కీర దోసకాయ తినడం వల్ల గరిష్టంగా పోషకాలు అందుతాయి.

ఫ్లేవనాయిడ్లు ,టానిన్‌లతో సహా యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి ,దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 

కీర దోసకాయలోని పెక్టిన్ పేగు కదలికలను బాగు పరుస్తుంది. తద్వారా మలబద్దకాన్ని కూడా  తగ్గించుకోవచ్చు.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)