పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి..స్పెషల్‌ అట్రాక్షన్‌గా వజ్రాభరణాలు

Published on Sat, 07/11/2026 - 17:30

ప్రతి రెండేళ్లకొకసారి జరిగే పారిస్‌​ హాట్‌ కౌచర్‌ వీక్‌ ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుక. ఈ ఫ్యాషన్‌ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్లు తమ చేతితో రూపొందించిన ప్రత్యేకమైన కలెక్షన్లను ప్రదర్శిస్తారు. ఈ వేడుక మొత్తం డిజైనర్లు, వారి ప్రత్యేకమైన ఫ్యాషన్ శైలి గురించే ఉంటుంది. 

ఈ ఏడాది మాత్రం హైదరాబాద్‌ బిలియనీర్‌ సుధారెడ్డి ధరించిన రత్నఖచిత ఆభరణాలే ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంటలో మూడు  రోజుల పాటు ఆమె ధరించిన ఆభరణాల లుక్‌ అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. సెలబ్రిటీ ఆభరణాల నిపుణుడు ప్రియాంశు గోయల్ ప్రకారం.. సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు ఆమె వ్యక్తిగత కలెక్షన్‌కు చెందినవని, వాటి విలువ సుమారు రూ. 280 కోట్లు పైమాటే అని చెబుతున్నారు.

జార్జియో అర్మానీ షోలో రూ. 20 కోట్లు ఖరీదు చేసే..
జార్జియో అర్మానీ షో కోసం, సుధా రెడ్డి ఆ బ్రాండ్ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్ నుంచి నీలి రంగులో శిల్పంలా చెక్కిన దుస్తులలో విచ్చేశారు. ఆ లుక్‌ నిశబ్ధమైన విలాసాన్ని చాటి చెప్పింది. అలాగే తన లుక్‌ హైలెట్‌గా కనిపించేలా 30 క్యారెట్ల వజ్రాలు పొదిగిన పాంథర్ ఇయర్ కఫ్స్‌ను జతచేశారు. దీంతోపాటు రూ. 20 కోట్లు విలువ చేసే  23 క్యారెట్ల పసుపు వజ్రపు ఉంగరాన్ని కూడా ధరించారు. 

 ఎలీ సాబ్ రన్‌వే కోసం.. 
ఎలీ సాబ్ షోలో కూడా, సుధా రెడ్డి దుపట్టాతో జతచేసిన స్ట్రాప్‌లెస్ ఫ్లోరల్ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. సింపుల్‌ ఆకృతిలో కనిపించే క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ మెరిశారామె. ఆమె ఆభరణాల కలెక్షన్‌కి  సంబంధించిన వారసత్వ ఆభరణాలు ఈ ప్రత్యేకమైన దుస్తులకు మరింత శోభను చేకూర్చాయి.

ఆమె ధరించిన అద్భుతమైన దుస్తుల అందాన్ని ఏమాత్రం తగ్గించకుండా, ఎలీ సాబ్ రూపొందించిన టర్కోయిస్ ఇయర్ కఫ్స్ వెంటనే అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఇయర్ కఫ్స్‌లో పొదిగిన టర్కోయిస్ రత్నమే గతంలో సల్మాన్ ఖాన్ బ్రాస్‌లెట్‌లో కూడా కనిపించిందని ప్రియాంశు గోయల్ పేర్కొన్నారు.

మనీష్ మల్హోత్రా పారిస్ షోలో
పారిస్ కౌచర్ వీక్‌లో మనీష్ మల్హోత్రా తొలి షోలో, సుధా రెడ్డి చేతి ఎంబ్రాయిడరీతో కూడిన సిల్హౌట్ కార్సెట్‌ను ఎంచుకున్నారు. ఆ దుస్తుల్లో వాస్తుశిల్ప వివరాల ఎంబ్రాయిడరీని మరింతగా హైలైట్ చేశాయి.

ఈ డిజైనర్‌వేర్‌కి మల్హోత్రా కలెక్షన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన డైమండ్ బో నెక్లెస్‌ను జత చేశారు. పర్షియన్ డిజైన్ నుంచి ప్రేరణ పొందిన ఈ పూల హెయిర్ యాక్సెసరీ ఆమె రూపాన్ని మరింతగా మెరుగుపరిచింది. ఈ నెక్లెస్‌లో 75 క్యారెట్ల అత్యున్నత నాణ్యత గల సహజ వజ్రాలు పొదిగి ఉన్నాయని ప్రియాంశు గోయల్ పేర్కొన్నారు. ఈ డైమండ్ హెయిర్ క్లిప్ విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. 

అంతేగాదు పారిస్ హాట్ కౌచర్ వీక్‌లో సుధా రెడ్డి ధరించిన ప్రతి ఆభరణం ఆమె వ్యక్తిగత సేకరణకు చెందినదేనని నిపుణులు పేర్కొన్నారు. కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా ఈ MEIL గ్రూప్ డైరెక్టర్‌లో ఒకరామె.

(చదవండి: 70 ఏళ్ల వృద్ధుడి ఇడ్లీ వ్యాపారం క్రేజ్‌కి మాటల్లేవ్‌ అంతే..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)