Breaking News

అకస్మాత్తుగా బరువు తగ్గారా? గుండె దడ పెరుగుతోందా?

Published on Wed, 02/25/2026 - 07:54

మన శరీరంలో చోటుచేసుకునే చిన్నపాటి మార్పులే భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు. హఠాత్తుగా శరీరం బరువు తగ్గినా, దానికి తోడు.. కూర్చున్నా, పడుకున్నా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించినా.. వీటిని అలసటగా భావించి, నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా బరువు తగ్గడం, అసాధారణంగా గుండె వేగం పెరగడం అనేవి  ‘హైపర్ థైరాయిడిజం’నకు సంకేతాలు కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ‘హైపర్ థైరాయిడిజం’ అంటే ఏమిటి? అది ఎంత ప్రమాదకరం?

మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి.. శరీర జీవక్రియలను నియంత్రించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం మెడకు సంబంధించిన గ్రంథి మాత్రమే కాకుండా శరీర ఉష్ణోగ్రత, శక్తి ఉత్పత్తి, గుండె  కొట్టుకోవడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. హెల్థియన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సోహిని సేన్ గుప్తా వివరణ ప్రకారం థైరాయిడ్ గ్రంథి  అధికంగా పనిచేయడం ప్రారంభించినప్పుడు శరీరంలోని మొత్తం వ్యవస్థ వేగవంతమవుతుంది. దీనివల్ల జీవక్రియల వేగం పెరిగి, కేలరీలు త్వరగా కరిగిపోతాయి. ఫలితంగా గుండె సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మితిమీరి, శరీరం ఒక్కసారిగా ‘ఓవర్ డ్రైవ్’ మోడ్‌లోకి వెళ్తుంది.

హైపర్ థైరాయిడిజం లక్షణాలు ప్రారంభంలో చాలా స్వల్పంగా ఉండటం వల్ల వీటిని గుర్తించడం  కష్టమవుతుంది. సాధారణం కంటే ఎక్కువగా ఆకలి వేసినా లేదా ఆహారం బాగానే తీసుకుంటున్నా బరువు తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. దీనికి తోడు చేతులు వణకడం, విపరీతమైన ఆందోళన, చిరాకు, నిద్రలేమి, చెమటలు పట్టడం, ఎండను ఏమాత్రం తట్టుకోలేకపోవడం లాంటి మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా విడివిడిగా కనిపిస్తుండటంతో, చాలామంది వీటిని సాధారణ సమస్యలుగా భావించి, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తుంటారు.

స్టెరిస్ హెల్త్‌కేర్ ఛైర్మన్ జీవన్ కాస్రా అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గడం, గుండె వేగం పెరగడం  ఒకేసారి జరుగుతుంటే ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. జీవక్రియలు మితిమీరిన వేగంతో సాగడం వల్ల గుండెతో పాటు ఇతర అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ లక్షణాలు కేవలం థైరాయిడ్ వల్లనే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కూడా వచ్చే అవకాశం ఉన్నందున  వైద్య పరీక్షలు  తప్పనిసరి అవుతాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే,  దీర్ఘకాలిక హృద్రోగ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

అయితే థైరాయిడ్ సమస్యను గుర్తించడం చాలా సులభమని వైద్య నిపుణులు  చెబుతున్నారు. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా రక్తంలోని హార్మోన్ల స్థాయిలను కొలిచి, థైరాయిడ్ పనితీరును నిర్ధారించవచ్చు. వ్యాధి ముదరకముందే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులు, తగిన చికిత్స ద్వారా హార్మోన్ల ఉత్పత్తిని అదుపులోకి తెచ్చి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో చోటుచేసుకునే చిన్న మార్పులైనా అవి నిరంతరంగా కొనసాగుతుంటే, వాటిని విస్మరించకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడమే ఉత్తమం. ప్రారంభ దశలోనే స్పందించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే కాకుండా, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఐరాసలో భారత్ తటస్థం

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)