Breaking News

Rahu Ketu రాహుకేతువుల కథ

Published on Fri, 05/09/2025 - 09:57

భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.

తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.

రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.

ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

అందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు.  నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.

రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. 

– యామిజాల జగదీశ్‌

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)