Breaking News

సమంత రోజు ఎలా గడుస్తుందంటే...???

Published on Wed, 09/11/2024 - 12:35

అందం, అభినయంతో సినీ పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగిన  నటి సమంత రూత్ ప్రభు. మోడల్‌ నుంచి మొదలై  స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. వ్యక్తిగత జీవితంలో  ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతే దృఢంగా నిలబడుతోంది. ఆరోగ్యం సహకరించక పోయినా అచంచల విశ్వాసంతో తన కలల సాకారంకోసం నిబద్ధతగా సాగుతోంది. పురుషాధిక్య సినీ ప్రపంచంలో హీరోయిన్‌గా రాణిస్తోంది. 

అలాగే సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటూ  అనేక ఆరోగ్య విషయాలను పంచుకోవడం సమంతాకు అలవాటు.  ఈ క్రమంలో తన దినచర్య వివరాలను పంచుకుంది. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, క్రీడలతోపాటు, వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటోంది అనే  ‘ది డే  ఇన్‌ మే లైఫ్‌’ అనే చిన్న వీడియోలో షేర్‌ చేసింది. ఆరోగ్యాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో తన అభిమానులకు చెప్పకనే  చెప్పేసింది. ఆరోగ్యం పట్ల  సమంత తీసుకుంటున్న శ్రద్ధకు, ఫిటె్‌నెస్‌కు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మీరు స్టార్‌. చాలా స్ఫూర్తి దాయకం!  అంటూ కమెంట్‌ చేశారు.

కాగా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ ఫీనిక్స్‌ పక్షిలో  తనను తాను నిరూపించుకుఉంటోంది. ఈక్రమంలోనే  ప్రతిష్టాత్మక “సిటాడెల్” సిరీస్‌తో బాగానే ఆకట్టుకుంది. అలాగే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.  చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా కొత్త ప్రయాణం ప్రారంభించినట్టు సమంత స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)