Breaking News

గతజన్మలో అబ్బాయి.. ఈ జన్మలో అమ్మాయి.. షాకైన తల్లిదండ్రులు!

Published on Sun, 11/29/2026 - 08:12

అది శ్రీలంకలోని హెదునువేవా– దిహింతలా ప్రాంతం. 1956 ఫిబ్రవరి 14న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జ్ఞానతిలకకు అప్పుడు రెండేళ్ల వయసు. అప్పుడప్పుడే ముద్దు ముద్దుగా మాటలు చెబుతోంది. ‘నాకు మరో అమ్మానాన్న ఉన్నారు... ఇద్దరు సోదరులు, పలువురు అక్కచెల్లెళ్లు కూడా ఉన్నారు. వారంతా తలవకెలె అనే ఊరిలో ఉంటారు...’ అని ఆమె చెప్పిన మాటలు తల్లిదండ్రులను విస్మయానికి గురిచేశాయి.

కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు తాను తలవకెలెలోని తల్లి దగ్గరకు వెళ్లిపోతానని బెదిరించేది. ఆమె చెప్పిన గతజన్మ ఊరు తన నివాస ప్రాంతానికి దాదాపు 22 మైళ్ల దూరంలో ఉంది. అసలు ఆ ఊరితో ఈ చిన్నారికి సంబంధం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ ఉదంతం గురించి తెలుసుకున్న శ్రీలంకకు చెందిన పాత్రికేయుడు, పండితుడు హెచ్‌.ఎస్‌.ఎస్‌. నిశ్శంక పరిశోధన ప్రారంభించారు. పునర్జన్మకు సంబంధించిన కథనాలను ఆయన అప్పటికే పత్రికలో ప్రచురిస్తున్నారు. 1960 నవంబరు 1న ఆయన ఈ కేసు విచారణ చేపట్టారు. అప్పటికి జ్ఞానతిలక వయసు నాలుగేళ్లు. నిశ్శంక ఆమె మాటలను రాతపూర్వకంగా నమోదు చేయడంతోపాటు టేపుల్లోనూ భద్రపరచారు.

విచారణలో తాను గతంలో అబ్బాయినని జ్ఞానతిలక చెప్పింది. తన తండ్రి తేయాకు తోటల్లో పనిచేసేవాడని తెలిపింది. అక్కతో కలిసి రైలులో పాఠశాలకు వెళ్లేదాన్నని చెప్పింది. క్వీన్‌ ఎలిజబెత్‌ రైలులో ప్రయాణిస్తూ వెళ్లినప్పుడు తాను ఆమెను చూశానని పేర్కొంది. ఈ వివరాల్లో కొన్ని సాధారణంగా ఊహించగలిగేవిగా అనిపించవచ్చు. కానీ క్వీన్‌ ఎలిజబెత్‌ రైలు ప్రయాణం, పాఠశాలకు వెళ్లే మార్గం, కుటుంబ సభ్యుల అలవాట్లు వంటి నిర్దిష్ట అంశాలు పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా క్వీన్‌ ఎలిజబెత్‌ శ్రీలంక పర్యటన జ్ఞానతిలక పుట్టడానికి రెండేళ్ల ముందే జరిగింది.

ఈ విషయాలు ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని నిశ్శంక నిర్ణయించుకున్నారు. జ్ఞానతిలకను తలవకెలెకు తీసుకెళ్లారు. ఆమె చెప్పిన వివరాలకు దగ్గరగా ఉన్న ఒక కుటుంబం గురించి సమాచారం లభించింది. ఆ కుటుంబానికి చెందిన గల్లగే ట్యూరిన్‌ తిలకరత్నే అనే బాలుడు 1954 నవంబరు 9న 13 ఏళ్ల వయసులో మరణించాడు. జ్ఞానతిలక జన్మించడానికి సుమారు 15 నెలల ముందే అతడు చనిపోయాడు. అతడికి ఆరుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. తన అక్కతో కలిసి రైలులో పాఠశాలకు వెళ్లేవాడు.

1960 డిసెంబరు 18న జ్ఞానతిలకను తిలకరత్నే కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాటు చేశారు. తిలకరత్నే కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా గదిలోకి తీసుకొచ్చారు. తిలకరత్నే తల్లి గదిలోకి ప్రవేశించగానే చిన్నారి ఒక్కసారిగా ఉత్సాహంగా లేచి ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. ‘తలవకెలె అమ్మా!’ అంటూ పిలిచింది. ఆ తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులను కూడా గుర్తించినట్లు పరిశోధకుల నివేదికలు చెబుతున్నాయి. తిలకరత్నేకు పరిచయంలేని మరో వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మాత్రం తనకు తెలియదని చెప్పింది. తిలకరత్నేకు బాగా దగ్గరైన ఉపాధ్యాయుడు డి.వి.సుమితపాలాను జ్ఞానతిలక గుర్తించడమే కాకుండా ఆయన నేర్పిన ఓ కథలోని భాగాన్ని ఆమె తిరిగి చెప్పింది. అది చూసిన ఉపాధ్యాయుడు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన విషయం తిలకరత్నే మరణానికి సంబంధించినదే. తిలకరత్నే మరణానికి ముందు ఇంట్లో కుర్చీపై నుంచి కిందపడినట్లు జ్ఞానతిలక చెప్పింది. భోజనం చేస్తున్న సమయంలో తనను తల్లి కొట్టడంతో కుర్చీపై నుంచి కిందపడ్డానని పేర్కొంది. అయితే తిలకరత్నే కుటుంబ సభ్యులు మాత్రం పాఠశాలలో క్రికెట్‌ ఆడుతుండగా బంతి కాలికి తగలడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు.

1962లో తిలకరత్నే తల్లి సమక్షంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు జ్ఞానతిలక తీవ్రంగా స్పందించింది. ‘అమ్మా... నువ్వు అబద్ధం చెబుతున్నావు! నేను అలా చనిపోలేదు. కుర్చీపై నుంచి కిందపడ్డాను. ఇప్పుడు కూడా అబద్ధం చెబుతున్నావు!’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

పునర్జన్మపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఇయాన్‌ స్టీవెన్‌ సన్‌  జ్ఞానతిలక ఉదంతం గురించి తెలుసుకున్నారు. 1961లో శ్రీలంకకు వెళ్లి జ్ఞానతిలకను, ఆమె కుటుంబ సభ్యులను, తిలకరత్నే కుటుంబాన్ని, ఇతర సాక్షులను విచారించారు. నిశ్శంక నమోదు చేసిన వివరాలను ముందుగా చూడకుండా స్వతంత్రంగా పరిశోధన చేపట్టారు.

తర్వాత తన పుస్తకంలో ఈ ఉదంతానికి స్థానం కల్పించారు. జ్ఞానతిలక కేసును పునర్జన్మకు సూచనగా నిలిచే ఆసక్తికరమైన కేసుగా పేర్కొన్నారు. జ్ఞానతిలక కేసు ప్రచారంలోకి వచ్చిన తర్వాత శ్రీలంకలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని పునర్జన్మకు బలమైన ఉదాహరణగా భావించగా, మరికొందరు సందేహాలు లేవనెత్తారు.

నాలుగేళ్ల చిన్నారి తనకు తెలియని ఊరికి వెళ్లాలని పట్టుబట్టడం; అక్కడి ఓ కుటుంబాన్ని గుర్తించడం; గతంలో మరణించిన బాలుడి జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను చెప్పడం; అతడికి పరిచయమైన ఉపాధ్యాయుడిని గుర్తించడం; ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా? చిన్నతనంలో ఎక్కడో విన్న విషయాలు మనసులో ముద్రపడి ఇలా బయటకు వచ్చాయా? కుటుంబాల మధ్య తెలియని సమాచార మార్పిడి జరిగిందా? లేక మనిషి మరణించిన తర్వాత కూడా అతడి జ్ఞాపకాలు మరో శరీరంలో కొనసాగుతాయా? ఈ ప్రశ్నలకు జ్ఞానతిలక కేసు సమాధానం చెప్పలేకపోయింది. కానీ పునర్జన్మపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది.

- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇదీ చదవండి: అబ్బురపరిచిన  ఆర్కిటెక్ట్‌

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)