Breaking News

శ్రావణం : రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే 

Published on Fri, 07/25/2025 - 10:47

చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రావణ మాసంతోనే హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగలు ప్రారంభమవుతాయి. శ్రావణం శుభకరం అని కూడా అంటారు. ఈ మాసంలో రోజూ పండుగేనని ప్రతీ ఘడియ లక్ష్మి కటాక్షమే అని విశ్వసిస్తారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తమమైనదిగా పేర్కొంటారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కాగా, ఈ నెల 29న నాగుల పంచమి, వచ్చే నెల 8న వరలక్ష్మివ్రతం, 9న శ్రావణ పౌర్ణమి(రాఖీ పండుగ), 16న శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.  

మంగళ, శుక్ర, శనివారాలకు ప్రాధాన్యత 
శ్రావణమాసంలోని మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి భక్తులు నమ్ముతారు. మంగళవారాలు శ్రీగౌరీ, శుక్రవారాలు శ్రీలక్ష్మీ, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజలకు ముఖ్యమైన రోజులు. వీటికి తోడు శ్రావణంలోని శుక్ల పక్షంలోని 15 రోజులు ఎంతో విశేషమైనవి. సకల ఉపచారాలతో నిష్ఠగా మహలక్షి్మవ్రతం నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్యకు ఈ వ్రతంలో ప్రాధాన్యత. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరం ధరించి తొమ్మిద రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నివేదన చేసి ముత్తైదువులకు వాయినమిస్తారు. 

మహిమాన్వితం శ్రావణ పున్నమి 
శ్రావణ మాసం పౌర్ణమి ఎంతో మహిమ కలిగినదని చెబుతారు. గాయత్రీ ఉపాసన చేసే వారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు. సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవుని జయంతి కూడా ఇదే రోజు. రక్షా బంధనం, రుషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజున ఆచరిస్తారు. ఎంతో మహిమాన్విమైన ఈ తిథినాడు పూజిస్తే సత్ఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి.  

ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

పరమపవిత్రం శ్రావణం 
హిందువుల పరమ పవిత్రం శ్రావణ మాసం. ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రతీ హైందవ ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు వంటి పూజలు చేస్తారు.  –సదాశివ శర్మ, పురోహితులు, చిన్నకోడూరు

చదవండి:  జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్‌ వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)