Breaking News

సీతారాముల కల్యాణం.. చూతము రారండీ..

Published on Sat, 04/05/2025 - 09:29

శ్రీ సీతారాముల కల్యాణానికి నగరం నలుమూలలా ఉన్న రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ‘అమ్మపల్లి’ దేవస్థానం. ఏకశిలా రాతి విగ్రహంతో.. దశావతారంలో మకర తోరణం కలిగి శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ కొలువయ్యారు. యేటా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం నర్కూడ శివారులోని అమ్మపల్లిలోని ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రశస్థి. ఇక్కడి ఆలయ, ప్రాకారాల నిర్మాణాల గురించి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలూ లేకపోయినా.. అప్పటి నిర్మాణ శైలి, విగ్రహ రూపాలను బట్టి 18వ శతాబ్దం నాటివిగా పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. 

నర్కూడలోని అమ్మపల్లి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో రెండు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. ఆదివారం ఉదయం 11.49 గంటలకు స్వామి కల్యాణం జరుగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం చుట్టూ క్యూలైన్లు, ఇతర ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

ఎత్తయిన ఆలయ గోపురం.. 
అమ్మపల్లి ఆలయానికి ఎత్తయిన గోపురం ప్రత్యేక ఆకర్షణ. సుమారు 80 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో ఈ గోపురం నిర్మితమైంది. ఆలయ గోపురం, ప్రాకారాలు చారిత్రక కళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, వెనకాల మరో కోనేరు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఎదురుగా ఉన్న మంటపంలో యేటా శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 
మంటప సమీపంలో నగారా, రథశాల ఉన్నాయి. శ్రీరామ లింగేశ్వర, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి.

గద్వాల్‌ సంస్థానం నుంచి విగ్రహాలు.. 
నిజాం దర్బార్‌లో వివిధ హోదాల్లో పని చేసిన రాజా భవానీ ప్రసాద్‌ భటా్నగర్‌ 1790లో దేవాలయం పనులను ప్రారంభించగా.. 1802లో విగ్రహ ఆవిష్కరణను కేరళకు చెందిన పూజారి వెంకటరమణాచారి, రాజా భవానీ ప్రసాద్‌ల నేతృత్వంలో గద్వాల్‌ సంస్థానం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను తీసుకొచ్చి అత్తాపూర్‌ రాంబాగ్‌లో విగ్రహా ప్రతిష్టాపన చేశారు. దీనికి మూడో నిజాం సికిందర్‌ జా ముఖ్య అతిథిగా హజరయ్యారు. నాటి నుంచి నేటి వరకూ వారి వారసులు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. 300 సంవత్సరాలు గల ఈ దేవాలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు. భద్రాది రాములోరి కల్యాణం జరిగే సమయంలోనే అత్తాపూర్‌ రాంబాగ్‌ దేవాలయంలో అత్యంత వైభవంగా కల్యాణ ఉత్సవం ఆనవాయితీగా వస్తుంది.

అత్తాపూర్‌ రాంబాగ్‌లో.. 
అత్తాపూర్‌ : అత్తాపూర్‌ రాంబాగ్‌లోని చారిత్రాత్మక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే దేవాలయాన్ని రంగులు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ మహోత్సవం, 7న దశమి రోజున రథోత్సవంతో పాటు లంకా దహనం, 8న సీతారామలక్ష్మణులకు దోపుసేవ, 9న వీధి సేవతో పాటు చక్రతీర్థం వంటి కార్యక్రమాలతో ముగుస్తాయని పూజారి తిరుమల దేశభక్త ప్రభాకర్, శ్రీనివాస్‌లు వెల్లడించారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)