నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే!
Published on Sun, 09/20/2026 - 10:23
‘గుండు గుండు గుండున్నర...’ అని తలపై తగ్గిన జుట్టును చూసి పాడే పాటను మరచిపోవాలంటే, తలకింద స్టయిల్ మారాలి. నిజానికి బట్టతల వచ్చిన తర్వాతే చాలామందికి స్టయిల్లో కొన్ని కొత్త దారులు తెరుచుకుంటాయి. అందుకు మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఫోలో అవ్వండి.
యుద్ధం ఆపేయండి!
జుట్టు పలుచబడుతూ మధ్యలో ఖాళీలు కనిపిస్తుంటే, మిగిలిన కొద్దిపాటి జుట్టును ఎలాగోలా కప్పిపుచ్చే ప్రయత్నం పలుచబడిన జుట్టును కప్పిపుచ్చడం కంటే చిన్నగా ట్రిమ్ చేయండి లేదా క్లీన్ గా షేవ్ చేయండి.
గడ్డం పెంచండి
బట్టతల లుక్‌లో గడ్డం చాలా బలమైన స్టయిలింగ్ టూల్. ముఖానికి ఆకారం ఇవ్వడమే కాకుండా, తల–ముఖం మధ్య మంచి విజువల్ బ్యాలెన్ ్స తీసుకొస్తుంది.
సన్ గ్లాసెస్... బట్టతల లుక్‌కి బోనస్!
స్టయిలింగ్‌లో సన్ గ్లాసెస్ ఒక షార్ప్ పాయింట్ ఇస్తాయి. మీ ముఖానికి సరిపోయే ఫ్రేమ్ పెట్టుకుంటే, అప్పుడు మీరు సింపుల్ టీ–షర్ట్ వేసుకున్నా, ‘కూల్’గా మారిపోతారు. అలాగే, వాచ్, చైన్ , బెల్ట్ వంటి చిన్న యాక్ససరీసే మొత్తం లుక్‌కి ఫినిషింగ్ ఇస్తాయి.
క్రూ–నెక్కి ఓటేయండి!
మెడ చుట్టూ ఎక్కువ ఖాళీ కనిపించకుండా చేసే నెక్‌లైన్‌లు బట్టతలను బ్యాలెన్ ్స చేస్తాయి. వీరికి లాంగ్–స్లీవ్ క్రూ–నెక్ స్వెటర్లు, బ్లేజర్లు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా లోతైన వి–నెక్ కంటే క్రూ–నెక్, కాలర్ షర్ట్, లేయర్డ్ లుక్‌లు బెస్ట్. లోతైన వి–నెక్ పై ఛాతీ భాగాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పటికే తల భాగం ఓపెన్ గా ఉండటంతో పై భాగంలో మరింత ఖాళీ కనిపించొచ్చు.
చూపును కిందికి తీసుకెళ్లే మ్యాజిక్!
లాంగ్–స్లీవ్ స్వెటర్‌పై జాకెట్, షర్ట్‌పై కార్డిగన్ , టీ–షర్ట్‌పై స్పోర్ట్స్ కోట్... ఇలా లేయర్స్ పెడితే దుస్తుల్లో టెక్స్చర్, డెప్త్ వస్తాయి. అంటే చూపు ఒక్క తలపైనే ఆగకుండా మొత్తం దుస్తుల మీదుగా కదులుతుంది. వీటికి జతగా క్రాప్డ్ లేదా కఫ్డ్ ప్యాంట్స్, బ్లాక్ లేదా బ్రౌన్ షూస్ బాగా కనిపిస్తాయి.
డార్క్ రంగులే ముందు!
నలుపు, చార్కోల్, నేవీ, డీప్ బ్రౌన్ , ఆలివ్ వంటి డార్క్ రంగులు బట్టతల లుక్‌కి బాగా పనిచేస్తాయి. వీటితో పాటు క్రీమ్, లైట్ బ్లూ లేదా తెలుపు వంటి రంగులను కాంట్రాస్ట్‌గా ఉపయోగించండి. అయితే, స్టయిలింగ్‌లో భుజాలు, ఛాతీ, నడుము దగ్గర సరైన ఫిట్ చాలా ముఖ్యం. చాలా బిగుతుగా కాదు. చాలా వదులుగా కాదు. మీ శరీరాకృతికి సరిపోయే దుస్తులే లుక్‌ని ఖరీదైనదిగా చూపిస్తాయి.
టోపీ.. దాచడానికి కాదు!
టోపీ పెట్టుకోవడం బట్టతలను దాచుకోవడానికి మాత్రమే కాదు. సరైన దుస్తులతో క్యాప్, ఫెడోరా, క్లాసిక్ హ్యాట్‌ను సందర్భానికి తగ్గట్టు యాక్సెసరీగా వాడండి. కానీ ప్రతి సందర్భంలో టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక రోజు టోపీతో; మరో రోజు క్లీన్ షేవ్డ్ హెడ్‌తో... లుక్ మార్చుకుంటూ ఉండండి. చివరిగా, జుట్టు తగ్గొచ్చు... కానీ స్టయిల్ తగ్గకూడదు.
ఇదీ చదవండి: అమ్మ కన్నా అందం ఏముంది?
Tags : 1