Breaking News

8 కిలోలు తగ్గిన సోనమ్‌.. ఇకపైనా ఆహారం తీసుకోకుంటే జరిగేది ఇదే!

Published on Wed, 07/15/2026 - 12:30

విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఆయన ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి  మద్దతు ప్రకటిస్తూ, జూన్‌ 29న ఈ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఉవాసం కారణంగా..ఇప్పటికే ఆయన ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతలా సుదీర్ఘ ఉపవాసం కారణంగా శరీరంలో ఏ జరుగుతుంది?, ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!

ఇంతలా వాంగ్‌చుక్‌ సుదీర్ఘ ఉపవాసం కొనసాగిస్తే.. కలిగే వైద్యపరమైన ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంతేగాదు ఇప్పటికే ఆయన రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలో  67 mg/dLకి పడిపోగా, ఆయన రక్తపోటు 107/70 mm Hgగా నమోదైంది. ఇలా సుదీర్ఘకాలం ఆహారం తీసుకోవపోవడం ఎలాంటి శారీరక ప్రభావాన్ని చూపిస్తుందో.. విషమిస్తున్న ఆయన ఆరోగ్యమే నిదర్శనం అంటున్నారు వైద్యులు. 

అదీగాక వాంగ్‌చుక్‌ తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్న అందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత నిరసన రూపంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎంచుకున్నప్పటికీ..దీర్ఘకాలిక ఉపవాసం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత పోషణ లేకుండా ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతకు రెట్టింపుగా ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అంటున్నారు. అసలు అన్ని రోజులు ఆహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందంటే..

దీర్ఘకాలిక ఉపవాస సమయంలో  ఏం జరుగుతుందంటే..
శరీరం మొదట శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్‌పై ఆధారపడుతుంది. ఈ నిల్వలు అయిపోయిన తర్వాత, అది ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయితే, ఉపవాసం కొనసాగుతున్న కొద్దీ, శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి కండరాల ప్రోటీన్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. 

దీని ఫలితంగా కండరాలు క్షీణించి బలహీన పడటంతో వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపవాస సమయంలో, శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా ఈ లక్షణాలు అనుభవిస్తారు..

అలసట, తీవ్రమైన బలహీనత
తల తిరగడం, స్పృహ కోల్పోవడం
ఏకాగ్రత లోపం
నిరంతర తలనొప్పి
చిరాకు, మానసిక స్థితిలో మార్పులు
కండరాల నొప్పులు
డీహైడ్రేషన్ (నిర్జలీకరణం)

వాంగ్‌చుక్ కేవలం రెండు వారాల్లో 8.2 కిలోలు బరువు తగ్గినట్లు ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా తక్కువ సమయంలో గణనీయంగా బరువు తగ్గడం అనేది కొవ్వు, కండర ద్రవ్యరాశి రెండింటిలోనూ గణనీయమైన క్షీణతను సూచిస్తుంది.

ప్రమాదకర స్థాయిలో గ్లూకోజ్‌ స్థాయిలు..
వాంగ్‌చుక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి 67 mg/dLగా నమోదైంది, ఇది చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే సాధారణ ఉపవాస స్థాయి కంటే తక్కువ. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల వణుకు, చెమటలు పట్టడం, దృష్టి మసకబారడం, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. వైద్య సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతూనే ఉంటే, అది వైద్య అత్యవసర పరిస్థితిగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

దీర్ఘకాలిక ఉపవాసం దాదాపు ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా,  ఉపవాసం చాలా వారాల పాటు కొనసాగితే, ఈ సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇలానే నిరాహార దీక్ష కొనసాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు, అసాధారణ గుండె లయల ప్రమాదాన్ని పెంచుతాయి

తక్కువ రక్తపోటు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం కలుగుతాయి

కండర ద్రవ్యరాశి క్షీణించడం, గుండె కండరం బలహీనపడటంతో సహా

విటమిన్, ఖనిజ లోపాలు

రోగనిరోధక శక్తి తగ్గడం, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది

డీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల సమస్యలు

దీర్ఘకాలిక జీవక్రియ మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడి

తప్పనిసరిగగా వైద్య పర్యవేక్షణ 
దీర్ఘకాలిక ఉపవాసాలు లేదా నిరాహార దీక్షలు చేసే వ్యక్తులకు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే వైద్యులు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర బరువు, శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించడానికి, తక్షణ చికిత్స అవసరమా కాదా అనే నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది.

నిరాహార దీక్షలు ఒక రకమైన శాంతియుత నిరసన అయినప్పటికీ, నిశితమైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉపవాసం ఉండకూడదని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. తీవ్రమైన బలహీనత, గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, లేదా నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అనేది కోలుకోలేని సమస్యలను నివారించడానికి చాలా కీలకం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!)

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)