Breaking News

గ్రూప్‌ మీటింగ్స్‌లో ఈ భయం వెంటాడుతుందా? అయితే జాగ్రత్త!

Published on Fri, 10/02/2026 - 13:28

కొత్త వాళ్లను కలవాలంటే భయం.. నలుగురిలో మాట్లాడాలంటే టెన్షన్‌.. చివరకు ఫోన్‌ చేతిలో పెట్టుకుని పక్కకు తప్పుకోవడం! ఇలా తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు ఆందోళనను మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆ భయాన్ని గుర్తించి చిన్నచిన్న మార్పులు చేసుకుంటే.. మరింత ధైర్యంగా మారొచ్చట!

కొత్తవాళ్లను కలవడం, నలుగురిలో మాట్లాడటం, గ్రూపుల్లో కలవడం కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇతరులు తమ గురించి ఏమనుకుంటారోననే భయం వెంటాడుతుంటుంది. దీంతో మాట్లాడకుండా ఉండటం, చిన్న సమాధానాలకే పరిమితం కావడం, గ్రూపులకు దూరంగా ఉండటం వంటి అలవాట్లు పెరుగుతాయి. అయితే, ఇవి క్రమంగా సామాజిక ఆందోళనను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొత్త పరిస్థితుల్లో కొంత సిగ్గు, ఆందోళన ఉండటం సహజమే. అయితే ఆ భయం కారణంగా చదువు, ఉద్యోగం, స్నేహాలు, రోజువారీ పనులకు దూరమైతే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.

అలాగే, సామాజిక ఆందోళన ఉన్నవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు తమ ముఖం ఎర్రబడుతుందా, తాము సరిగ్గా మాట్లాడుతున్నామా, ఎదుటివారు ఏమనుకుంటున్నారో అంటూ తమపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. దీంతో, ఎదురుగా ఉన్న వ్యక్తి లేదా జరుగుతున్న సంభాషణపై దృష్టి పెట్టలేకపోతారు. ఫోన్‌ చూస్తూ ఉండటం, గ్రూపులో అంచున నిలబడటం, ఎప్పుడూ తెలిసిన వ్యక్తి పక్కనే ఉండటం, ముందుగానే ప్రతి మాటను సిద్ధం చేసుకోవడం వంటి వాటిని ‘సేఫ్టీ బిహేవియర్స్‌’గా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఇవి ఆ క్షణంలో భయాన్ని తగ్గించినట్లు అనిపించినా.. అదొక మానసిక వ్యాధిగా పెరుగుతూనే ఉంటుందంటున్నారు.

అయితే, భయపడే పరిస్థితులను పూర్తిగా తప్పించుకోవడం కంటే వాటిని క్రమంగా ఎదుర్కోవడం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు.. ఒక గ్రూపులో చిన్న ప్రశ్న అడగడం, సంభాషణలో ఒక మాట చెప్పడం వంటి చిన్న ప్రయత్నాలతో మొదలుపెట్టొచ్చు. మనం ఊహించినంత ప్రతికూలంగా ఎదుటివారు స్పందించకపోవచ్చని స్వయంగా గమనించడంతో భయం తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలో తనపై తాను ఎక్కువగా దృష్టి పెట్టడం మానేసి.. ఎదుటివారు చెప్పే మాటలు, చుట్టూ ఉన్న పరిస్థితులపై దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. అలాగే, మాట్లాడిన తర్వాత ‘నేను ఏదైనా తప్పుగా చెప్పానా?’ అంటూ పదేపదే ఆలోచిస్తూ బాధపడటం కూడా తగ్గించుకోవాలంటున్నారు.

అలాగే, ఆందోళన తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (CBT) వంటి మాట్లాడే చికిత్సలు సామాజిక ఆందోళనను ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయి. అయితే, మార్పు ఒక్కరోజులో రాదు. చిన్నచిన్న సామాజిక సందర్భాల్లో పాల్గొనడం, ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించడం, తప్పులు జరిగినా వాటిని పెద్ద విషయంగా భావించకపోవడంలాంటి వాటితో క్రమంగా ధైర్యం పెంచుకోవచ్చు. దీంతో, మనసులోని భయంతో పూర్తిగా తప్పించుకోవడం కంటే.. దాన్ని అర్థం చేసుకుని నెమ్మదిగా ఎదుర్కోవడం దైనందిన జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్య నిపుణుల సూచన.

ఇదీ చదవండి: మేయర్‌గా ఉంటూనే మెటర్నిటీ లీవ్‌.. ఏకంగా TIME100లో చోటు!

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)