Breaking News

కరెంట్‌ షాక్ నుంచి పాముని కాపాడారు!

Published on Thu, 10/09/2025 - 16:29

జడ్చర్ల టౌన్‌: విద్యుదాఘాతంతో గాయపడిన జెర్రిపోతుకు సర్ప రక్షకుడు సదాశివయ్య బుధవారం చికిత్స చేసి కాపాడారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జడ్చర్లలోని శ్రీలక్ష్మి రాజేంద్రనగర్‌ ఇండస్ట్రీలో పవర్‌ బోర్డులోకి జెర్రిపోతు చేరడంతో విద్యుదాఘాతానికి గురైంది.

ఇది గమనించిన ఇండస్ట్రీ యజమాని సర్ప రక్షకుడు (Snake Saver) సదాశివయ్యకు సమాచారం అందించాడు. దీంతో ఆయన బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య సంరక్షణ కేంద్రంలో చికిత్స చేశారు. ప్రస్తుతం జెర్రిపోతు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయుడు 
పర్వతగిరి: వరంగల్‌ జిల్లా పర్వతగిరి (parvathagiri) మండలంలోని రావూరు ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐదుగురు విద్యార్థులు ఉండే విధంగా ఉపాధ్యాయుడు చూడాలని కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎంఈఓ ఆదేశించారు. అయినా ఆ పాఠశాలకు ఐదుగురు విద్యార్థులు రాలేకపోయారు.

పాఠశాలను తీసేద్దామనుకున్న క్రమంలో ఒక విద్యార్థి చేరగా ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. పాఠశాలను గ్రామంలో ఉంచే విధంగా గ్రామస్తులు తీర్మానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులను పెంచే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. 

చ‌ద‌వండి: అయ్యో.. హైద‌రాబాద్‌లో ఇన్ని కేసులు మూసేశారా?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)