అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్‌ రహస్యం ఇదే..

Published on Fri, 03/06/2026 - 14:45

కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్‌లుక్‌లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్‌ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్‌ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..

సింగపూర్‌ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌, మోడల్‌ చువాండో టాన్‌కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్‌ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్‌లుక్‌ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. 

అంతలా మెయింటైన్‌ చేస్తున్నా అతడి గ్లామర్‌ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.

లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుందంటే..

ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక ‍క్రమశిక్షణయుత జీవనమే మేలు

బ్రేక్‌ఫాస్ట్‌: 
గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్‌మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. 

లంచ్‌ లేదా డిన్నర్‌:
భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్‌ లేదా చేప, రసం విత్‌ రైస్‌ ఉంటాయి. 
తప్పనిసరిగా వర్కౌట్‌లు. ఇవి కేలరీలు బర్న్‌ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్‌ చేసేలా డైట్‌ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. 

పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. 

నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్‌. 

అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. 

వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. 

కాగా, టాన్‌ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్‌ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్‌ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. 

వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్‌నెస్‌ పట్ల ఎంత కేర్‌గా ఉంటాడనేది. కాగా, టాన్‌ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.  సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్‌ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. సింపుల్‌గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్‌.

 

(చదవండి: ఫ్లైట్‌ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!)

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)