Breaking News

మురికి వాడలో పెరిగిన ఆ అబ్బాయ్‌ ..ఎన్నో జీవితాలను అద్భుతంగా మార్చాడు!

Published on Tue, 01/06/2026 - 17:21

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..మంచి స్ఫూర్తిదాయకమైన కథలు షేర్‌ చేస్తుంటారు. అలానే ఈసారి ఓ అద్భతమైన ప్రేరణాత్మక కథతో మన ముందుకొచ్చారు. సక్సెస్‌ అంటే..మనం మాత్రమే అభివృద్ధి చెందడం కాదని చెప్పే.. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పే అద్భుత కథ. అదేంటంటే..

20 మందితో ముంబై మురికి వాడలో ఒక పూరింట్లో పెరిగిన సిద్ధేష్‌ లోక్రే అనే యువకుడు మనందరికీ స్ఫూర్తి అంటూ అతడి స్టోరీని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసుకోవడమే గాక, అతడు తలపెట్టిన మహాత్తర కార్యానికి సైతం తన సపోర్ట్‌ ఫుల్‌ ఉంటుందని నొక్కి చెప్పారు. సిద్ధేష్‌ తండ్రి కూరగాయల వ్యాపారి, కాగా తల్లి క్లర్క్‌.

20 మందితో ఒకే గది ఉన్న ఇంట్లో పెరిగిన సిద్ధేష్‌ తన లైఫ్‌ని చదువుతోనే మార్చుకోగలని నమ్మి..చాలా కష్టబడి చదువుకున్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్‌లో ఎంబీఏ చేసి టెక్‌ స్టార్టప్‌గా ఎదిగాడు. అలా తన తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించి..మంచి కొడుకుగా హ్యాపీగా లైప్‌ లీడ్‌ చేస్తున్నాడు. అయితే సక్సెస్‌ అంటే ఇది కాదన్న వెళితి ఏదో వెంటాడుతూ ఉండేది. అసలు నిజమైన సక్సెస్‌ అంటే ఏంటీ అని ఆలోచిస్తూ..ఉండేవాడు. 

తనలా అందిరి జీవితాలు బాగుంటే అన్న ఆలోచనే..అతడి జీవితాన్నే మార్చేసింది. అందుకు సోషల్‌ మీడియా సాయం తోడు తెచ్చుకుని మరి. ఎంతోమంది పేద ప్రజల జీవితాలను తీర్చిదిద్దాడు. పైగా ఎన్నో మురికివాడలను, గ్రామాలను దత్తత తీసుకుని అందంగా మార్చి..ఎందరో పేదలకు ఆశాకిరణంగా నిలిచాడు ఆ యువకుడు. పాడైపోయిన ఎన్నో షాపులను పునర్నిర్మించాడు, ప్రజలకు ఉపయోగపడేలా సొంతంగా అంబులెన్స్‌ సర్వీస్‌ వంటి ఎన్నో సేవలతో తన ఆనందాన్ని, సక్సెస్‌ని వెతుకున్నాడు సిద్ధేష్‌. 

అక్కడితో ఆగలేదు ఆ యువకుడు తాజాగా మరో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే మిషన్ 30303. దీని సాయంతో 30 రోజుల్లో 30 పాఠశాలలను అభివృద్ధి చేసేల మౌలిక సదుపాయల కోసం రూ. 3 కోట్లు సేకరించడం. అందుకోసం కాస్త ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే బెంచీలు, టాయిలెట్లు  వంటి ప్రాథమిక అవసరాల నుంచి ఏఐ వంటి రోబోటిక్‌ ల్యాబ్స్‌ వరకు అన్ని ఆధునిక హంగులకు చాలా ఖర్చుతో కూడికున్న పని కావడంతో లక్ష్యం నెరవేరడం కష్టతరంగా మారింది సిద్ధుకి. 

అయితే అతడి నిస్వార్థ సేవ నచ్చి సిద్ధేష్‌ ప్రాజెక్టుకు తనవంతుగా మదతిస్తానుంటూ ముందుకొచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఆనంద్‌ మహీంద్రా. చాలామంది మనం సక్సెస్‌ అయ్యి ఓ మంచి పొజిషన్‌లో ఉంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా అందురూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్లుగా సాగుతున్న సిద్ధేష్‌ పయనం నిజంగా స్ఫూర్తిదాయకం, ప్రశంసించదగ్గ విషయం కూడా కదూ..!.

 

(చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!)


 

 

Videos

రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్

చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్‌ను నిలదీసిన నేతలు

East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన

Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)