'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం

Published on Fri, 06/27/2025 - 16:40

శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్‌ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్‌టాపిక్‌గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్‌ సక్సెస్‌ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

ఏ పేరెంట్స్‌కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. 

తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్‌లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి చేరిన వెంటనే గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. 

సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్‌ఎస్‌ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్‌ఎస్‌ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. 

దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.

కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ  మిషన్‌ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు.

 

 

(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్‌ లవ్‌ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..)
  
 

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)