Breaking News

జోర్‌ హుషార్‌.. సిమ్లా సమ్మర్‌

Published on Sun, 06/01/2025 - 17:21

‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్‌ ఫెస్టివల్‌’ నేటి (జూన్‌ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.

హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్‌ క్లైంబింగ్‌ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. 

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్‌ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్‌ 5న ముగియనున్నాయి. 

(చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్‌కాస్ట్‌..)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)