Breaking News

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

Published on Fri, 06/19/2026 - 08:44

ఉనికి.. ఇరికి పండ్ల చెట్లు 3–4 మీటర్ల ఎత్తు వరకు పెరిగి గొడుగు ఆకారంలో విస్తరించగలవు. బరువైన నేలలో వీటి సగటు ఎత్తుకంటే ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ చెట్లు సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో కూడా పెరగ గలవు. ఉప హిమాలయప్రాంతం నుండి కన్యాకుమారి వరకు ఈ చెట్లు విస్తరించాయి.

పొడి – తడి ఆకులు రాల్చే అడవులలోనూ వీటి ఉనికి అధికంగా ఉంటుంది. ఈ చెట్టు స్వస్థలం చైనా, జపాన్, తైవాన్, ఇండియా అయినప్పటికీ.. పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడ విరివిరిగా ఉన్నట్లు ఆనవాలు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో బంక చెట్లకు మంచి గుర్తింపు ఉన్నది. పడమటి – తూర్పు కనుమలలో వీటి ఉనికి అధికమని చెప్పవచ్చు.

కాబట్టి వీటిపై పరిశోధనలతో పాటు పల్లె ప్రజలకు ఈ చెట్ల ఉపయోగాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి కల్పించే విధంగా ప్రయోగ ఫలితాలు ఉంటే, గ్రామవాసులకే కాకుండా పట్టణ వాసులకు ఎంతో లబ్ది చేకూరుతుంది. 


ఉపయోగాలు

  • వీటి కలప గట్టిగా ఉన్నా వర్షానికి నానితే త్వరగా చెడిపోతుంది. దీన్ని ఫర్నీచర్, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు తయారీలో వాడతారు.

  • ఈ పండ్లు లేత గులాబీ రంగు కలిగి ఆకర్షణీయంగా ఉండి గుత్తులు గుత్తులుగా విపరీతంగా కాస్తాయి. గుజ్జు మాత్రం బంకతో కూడుకొని ఉండటం చేత దీనికి బంక పండు అని పేరొచ్చింది. పండ్లు ఓ మోస్తురు తీపి వగరుతో ఉంటాయి.

  • వీటి ఆకులను మేకలు ఇష్టంగా తింటాయి. పచ్చి కాయలను ఊరగాయగా, కూరగాయగా గ్రామాలలో కొందరు వాడతారు.

  • ఈ పండ్లలోని గుజ్జును పేపర్లు మొదలగు వాటిని అతికించటానికి ఉపయోగించేడివారని అమరాబాదు గ్రామస్తులు తెలిపారు.

  • ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెపుతున్నది. ఈ చెట్టు బెరుడు, వేర్లు, చిగుర్లు, ఆకులు మొదలగునవి అనేక రకాల రోగాలను నయం చేయటానికి నాటు వైద్యులు వాడేవారట. ముఖ్యంగా బెరుడుతో చేసిన కషాయాన్ని విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి, తల నొప్పి మొదలగు రుగ్మతల నుండి ఉపశమనం పొందటానికి మూలికా వైద్యులు ఇప్పటికీ వాడతారని చెంచులు చెప్పారు. 

  • బెరడు కషాయాన్ని నోటి అల్సర్‌లు ఉన్నపుడు నోటిలో పోసుకుని మూడు పూటలా పుక్కిలించాలి. మూడు రోజుల్లో తగ్గుతుంది.

  • పండ్ల గుజ్జును దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పికి వాడే మందుల తయారీలో ఉపయోగిస్తారు.

  • అట్లే పండ్లను పెరుగులో నాన బెట్టి రోజుకు రెండు సార్లు ఒళ్ళంతా పట్టిస్తే ఎండ పొడ నుంచి విముక్తి పొందవచ్చు. ఇరికి పండ్లలో అనేక పోషకాలు ఉన్నాయని పరిశీలనలో రుజువైంది.

నల్లమల అడవులు, ఇతర అడవులతో పాటు మైదానపుప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. రాను రాను ఈ చెట్లు నిరాదరణకు గురి కావడం చేత చాలా వరకు కొట్టి వేతకు గురవుతున్నాయి. బంక పండ్లపై ప్రత్యేకించి న్యూట్రీటివ్‌ విలువలపైన, ఔషధాల పరంగా ఎన్నో దేశాల్లో  పరిశోధనలు చేశారు. ప్రయోగాల ఫలితాలు రైతుల చెంతకు చెరలేదనవచ్చు. కాబట్టి ఈ పండ్ల దిగుబడి, విలువ ఆధారిత ప్రయోజనాలపై తగినన్ని పరిశోధనలు చేయగలిగితే, ఈ పండ్ల చెట్లు రైతుల చెంతకే కాకుండా మిద్దె తోటలతో పాటు పెరటి పండ్లుగా మారే అవకాశం ఎంతగానో ఉంది. ఇందుకు ఉద్యాన శాఖ, ఫారెస్ట్‌ (పరిశోధన, అభివృద్ధి), ఇతర శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నది.


వివిధ భాషల్లో ఇరికి / బంక పండు పేర్లు
- అస్సామీ: గోబోహాట్, బహుబర 
- ఇంగ్లీష్‌: ఇండియన్‌ చెర్రి, క్లమ్మి చెర్రి, ఫ్రాగ్రాంట్‌ మంజక్, స్పోట్టిగోబ్బల్స్, కుమ్మింగ్‌ కార్డియా, గ్లుచెర్రి, అనోనంగ్, పింక్‌ పర్, బర్‌ లైంట్రీ. 
- ఉర్దూ: లసుర, లస్సోర : ఒరియా: భురపత, లసోర. 
- కన్నడ: కెంజుల, చలైహన్ను, హడిగే, దొడ్డచల్లు, మన్నడికె కెండిల్, గోండెమర, కడుచలె. 
- గుజరాత్‌: వడ్‌ గుండ  : తమిళం: నరువిలి, సిటం, నరువలి. 
- తెలుగు: బోటీగిరి, ఇరికి పండు, బంక పండ్లు, బంకనక్కెర.
- మరాఠీ: బోకర్, సేలు. 
- హిందీ: లసోడ, లసోర, లంగ్రీ, గుండ
- సంస్కృతం: బహు వరహా
- పంజాబి: లసురే. 
- బెంగాలి: భోకరీ, బహుబర, బోచో. 
- నేపాలి: బొహొరి, కాలో బొహరి అని పిలుస్తుంటారు.ప్రాంతాలను బట్టి ఈ పండు పేరు ఉచ్ఛారణలో కొంత తేడా ఉండవచ్చు. - డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌, మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)