Breaking News

19 ఏళ్లకే గుండెపోటు? ఐపీఎస్‌ అధికారి కుమార్తె అనుమానాస్పద మరణం

Published on Mon, 09/02/2024 - 12:40

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శనివారం రాత్రి 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థిని అనికా రస్తోగి అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దీంతో అనికా కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు.  దీంతో అనికా  హఠాన్మరణంపై  గుండెపోటు టీనేజర్ల పాలిట శాపంగా మారుతోందా? చదువుల  ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా?   అసలేమైంది లాంటి అనేక సందేహాలు వెల్లువెత్తాయి.

మృతురాలు మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి సంజయ్ రస్తోగి కుమార్తె. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. అనికా బీఏ ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఆమె హాస్టల్‌ రూమ్‌లోని అపస్మారక స్థితిలో పడి ఉండగా  సిబ్బంది గుర్తించారు.  వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.   

ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హాస్టల్ గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆషియానా పోలీసులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)