వర్షం పడినా జర్నీ స్టైల్‌ తగ్గకూడదంటే… ఇలా చేయండి!

Published on Mon, 08/10/2026 - 10:56

వర్షాకాలం అంటే కేవలం వర్షాలు మాత్రమే కాదుం చల్లని గాలి, పచ్చని ప్రకృతి, తాజా వాతావరణంతో ట్రావెల్‌కి పర్ఫెక్ట్‌ సీజన్‌ కూడా. కానీ వర్షాకాలంలో డ్రెస్సింగ్‌ కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసుకుంటే జర్నీ మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్టైల్‌తో ΄ాటు కంఫర్ట్‌ని మెయింటేన్‌ చేయడం మాన్‌ సూన్‌ ఫ్యాషన్‌ లో ముఖ్యం.

తక్కువ బరువు ఉన్న ఫ్యాబ్రిక్‌ ఎంచుకోండి
వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాటన్, లైనిన్, రేయాన్‌ లాంటి లైట్‌వెయిట్‌ ఫ్యాబ్రిక్స్‌ కంఫర్టబుల్‌గా ఉంటాయి. హెవీ ఫ్యాబ్రిక్స్‌ వర్షపు నీటిని పీల్చుకుని ఎక్కువసేపు తడిగా ఉంటాయి. సులువుగా ఆరి΄ోయే బట్టలు అయితే బెటర్‌.

బ్రైట్‌ కలర్స్‌ బెస్ట్‌
వర్షాకాలంలో వాతావరణం ఆల్రెడీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి ΄ాస్టల్‌ షేడ్స్, బ్రైట్‌ కలర్స్, ఎర్తీ టోన్స్‌ మీ ఔట్‌ఫిట్‌కి ఫ్రెష్‌ లుక్‌ ఇస్తాయి. వైట్‌ షేడ్స్‌ కన్నా మురికి అంతగా కనిపించని రంగుల దుస్తువులు ఈ సీజన్‌ లో పెర్ఫెక్ట్‌గా సెట్‌ అవుతాయి.

కంఫర్టబుల్‌ ఫుట్‌వేర్‌ ముఖ్యం
వర్షాకాలం సీజన్‌ లో ఫుట్‌వేర్‌ సెలెక్షన్‌ చాలా ఇం΄ార్టెంట్‌. వాటర్‌ రెసిస్టెంట్‌ శాండిల్స్, క్విక్‌ డ్రై షూస్‌ లేదా కంఫర్టబుల్‌ స్లిప్పర్స్‌ ట్రావెల్‌కి చాలా సూట్‌ అవుతాయి. తడిసిన రోడ్డుల్లో కంఫర్ట్‌ కోసం గ్రిప్‌ ఉన్న ఫుట్‌వేర్‌ ఎంచుకోవడం మంచిది.

లేయరింగ్‌తో స్మార్ట్‌ లుక్‌
హిల్‌ స్టేషన్‌ లేదా చల్లని ప్రదేశాలకు ఈ వర్షాకాలంలో వెళ్తే మాత్రం లైట్‌ జాకెట్, హుడీ లేదా విండ్‌చీటర్‌ క్యారీ చేయడం మంచిది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుంది. కాబట్టి లేయరింగ్‌ స్టైల్‌తో కంఫర్ట్‌ మెయింటేన్‌ చేయవచ్చు.

రెయిన్‌ ఆక్సెసరీస్‌
గొడుగు, లైట్‌వెయిట్‌ రెయిన్‌ కోట్, వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్‌ కవర్‌ లాంటి యాక్సెసరీలు మాన్‌ సూన్‌ వార్డ్‌రోబ్‌లో భాగం అవుతాయి. మరీ ముఖ్యంగా ట్రావెల్‌లో కెమెరా, మొబైల్, డాక్యుమెంట్స్‌ని ప్రొటెక్ట్‌ చేయడానికి వాటర్‌ప్రూఫ్‌ ΄ûచెస్‌ బాగా ఉపయోగపడతాయి.

హెయిర్, పర్సనల్‌ కేర్‌ కూడా ముఖ్యం
తేమ వల్ల హెయిర్‌ కేర్‌ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సింపుల్‌ హెయిర్‌ స్టైల్, కంఫర్టబుల్‌ క్యాప్స్‌ లేదా స్కార్ఫ్‌లు వినియోగించడం వల్ల కాస్త లుక్‌ మెయింటేన్‌ చేయవచ్చు. అలాగే జుట్టును ప్రొటెక్ట్‌ చేసుకోవచ్చు.

వర్షాకాలంలో డ్రెస్సింగ్‌ అంటే కేవలం ఫ్యాషన్‌ మాత్రమే కాదు.. వర్షాకాలం అందాన్ని ఎంజాయ్‌ చేస్తూ కంఫర్టబుల్‌గా ఉండటం. సరైన ఔట్‌ఫిట్‌ ఛాయిస్‌తో వర్షాకాలంలో ప్రతి ట్రిప్‌ను స్టైలిష్‌గా మార్చుకోవచ్చు.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)