ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
Breaking News
సామాజిక బాధ్యత అంటే ఇదే..!
Published on Mon, 04/13/2026 - 14:12
రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.
ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది.
ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్.
*కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది ✊ అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన… pic.twitter.com/MqTuaqpGKh
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 12, 2026
(చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!)
Tags : 1