Breaking News

సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు

Published on Tue, 06/09/2026 - 06:32

సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్‌ బస్‌ హారన్  మోగుతుంది. టీచర్‌ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత  పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్‌ ఫీవర్‌ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.

తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్‌కి, కొత్త క్లాస్‌కి, కొత్త సెక్షన్‌కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్‌ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్‌ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్  చూసిన కళ్లతో రేపు బ్లాక్‌బోర్డ్‌ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్‌ ఫీవర్‌ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.

‘స్కూల్‌ ఫీవర్‌’ ఎందుకు?
రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్‌గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్‌.... ఇప్పుడు మళ్లీ టైమ్‌కి లేవాలి, ఇంట్లో స్కూల్‌లో రూల్స్‌ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్  బ్రేక్‌లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్‌లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్‌ సైజ్‌ చెక్‌ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్‌కి ‘ఓకే, స్కూల్‌కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్‌ వస్తుంది. ఫీవర్‌ దానంతట అదే తగ్గిపోతుంది.

కొత్త బ్యాగ్‌ బెంగను పోగొడుతుందా?
పోగొడుతుంది. కానీ బ్యాగ్‌ ఒక్కటే చాలదు. స్కూల్‌ ఫస్ట్‌ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్‌ ఫీవర్‌ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్‌లో భలే బాగున్నావ్‌ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి.  నవ్వితే బ్రెయిన్  ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్‌ అవుతుంది.  ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్‌ కనుక్కుని ‘నీ ఫేవరెట్‌ టిఫిన్‌ రెడీ’ అని చెప్పాలి.  కడుపు ఫుల్‌ అయితే మూడ్‌ ఆటోమేటిక్‌ సెట్‌. ∙స్కూల్‌కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ నీ సెక్షన్‌లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్‌ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్‌రూమ్‌లకు కొత్తగా పెయింట్‌ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్‌ అవుతారు.

హుషారుగా ఎలా ఉండాలి?
‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్‌’ అని చెప్పాలి. ‘టీచర్‌ క్లాస్‌లోకి రాగానే గుడ్‌ మార్నింగ్‌ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్‌టైమ్‌లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్‌డే ఎవరూ నీ ర్యాంక్‌ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.

బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్‌ ఉందో నీ సెక్షన్‌లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్‌తోనే ఇవాళ స్కూల్‌కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్‌బోర్డు, బెల్‌ అన్నీ నీ కోసమే వెయిట్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్‌షిప్‌ చెయ్‌...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే.
 
కేస్‌ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతి
కార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్‌ తెరిస్తే సెవెన్త్‌లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్‌ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్‌ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్‌లో నా ఫ్రెండ్స్‌ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్‌లో నీకిష్టమైన ఫుడ్‌ పెట్టాను.  అది లంచ్‌లో నీ పక్కవాడితో షేర్‌ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్‌గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్‌ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్‌ ఫీవర్‌ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్‌డేకి ప్రిపేర్‌ చేయాలి.

కేస్‌ స్టడీ 2:  శ్రావ్య, 10వ తరగతి
శ్రావ్య హైదరాబాద్‌లో ప్రయివేట్‌ స్కూల్‌. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్‌లో మ్యాథ్స్‌లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్‌ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్‌ మేడం సెలవుల్లో ఏం చేశావ్‌ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్‌ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్‌... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్‌ చేయండి. ఫస్ట్‌ డే ఇది మేడం డెస్క్‌ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్‌ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్‌ ఫీవర్‌ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)