మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!

Published on Mon, 02/24/2025 - 14:44

తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక చీరకట్టు.. అలాంటి చీరకట్టులోని ఔన్నత్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా నగర నారీమణులు ఉత్సాహంగా శారీ రన్‌లో పాల్గొన్నారు. అద్భుతమైన చీరకట్టుకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమనేలా వివిధ రకాల చీరకట్టుతో హాజరయ్యారు. ఆదివారం ఉదయం ట్యాంక్‌ బండ్‌ వేదికగా నారీమణులు తెలుగు సంప్రదాయ చీరకట్టుతో పీపుల్స్‌ ప్లాజా నుంచి జలవిహార్‌ మీదుగా శారీ రన్‌లో పాల్గొని తిరిగి పీపుల్స్‌ ప్లాజా చేరుకున్నారు. 

సుప్రసిద్ధ బ్రాండ్‌ తనైరా, ఫిట్‌నెస్‌ కంపెనీ జేజే యాక్టివ్‌ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ శారీ రన్‌ను తనైరా సీఈఓ అంబుల్‌ నారాయణ్, జేజే యాక్టివ్‌ కోచ్‌ ప్రమోద్‌ ప్రారంభించారు. తనైరా శారీ రన్‌ ఐక్యత, స్ఫూర్తి చిహ్నంగా మహిళలలోని స్త్రీతత్వం, ఫిట్‌నెస్‌కు ప్రేరణగా నిర్వహించినట్లు అంబుల్‌ నారాయణ్‌ తెలిపారు. మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించేందుకు మొదటి ఎడిషన్‌ను 2020లో పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించామని రెండో ఎడిషన్‌ను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. 

చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్‌ చేసిన పీఎం మోదీ

చందాకొచ్చర్‌ న్యూ జర్నీ: కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర ఆసక్తి

ఉత్సాహంగా సాగిన శారీ రన్‌లో మహిళలు అందమైన చీరకట్టుతో హాజరుకాగా.. కొందరు బుల్లెట్లు తోలుతూ, మరికొందరు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున సాగర తీరంలో శారీ రన్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రన్‌లో పాల్గొన్న పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. 

సుమారు మూడు వేల మందికిపైగా రన్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా ఫినిషింగ్‌ పాయింట్‌లో సెల్పీలు, గ్రూఫ్‌ ఫొటోలు దిగారు. జేజే యాక్టివ్‌ కోచ్‌ ప్రమోద్‌ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు వామ్‌ అప్‌ ఫిట్‌నెస్, జుంబా చేయించారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)