Breaking News

60లో కూడా సల్మాన్‌లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...

Published on Tue, 12/23/2025 - 14:13

బాలీవుడ్‌ ప్రముఖ‌ నటుడు భాయిజాన్‌ సల్మాన్‌ఖాన్‌కి ఈ డిసెంబర్‌ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తన ఫోటోలను షేర్‌ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్‌గా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్‌గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్‌నెస్‌ ఐకాన్‌' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్‌ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..
ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్‌మిల్‌, క్రాస్‌ ట్రైనర్‌, సైక్లింగ్‌..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్‌ ట్రైనింగ్‌ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణుల.

అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్‌ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్‌ఓ.

డైట్‌ ఎలా ఉండాలంటే..

ఉదయం: 5 ఎగ్‌వైట్స్‌, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్‌. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.

మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్‌, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.

రాత్రి: 100 గ్రాముల చికెన్‌ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. 

అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్‌ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

చదవండి: విండో క్లీనర్‌ నుంచి బిలియనీర్‌ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)