Breaking News

ఏడడుగులు తడబడి... విడివడి

Published on Sat, 06/28/2025 - 06:17

మన దగ్గర ‘పెళ్లి పుస్తకం’ అమ్మాయి సహనం, సైలెన్స్‌.. అబ్బాయి ఆజ్ఞ, అధికారంతో రాసి ఉంది! కుటుంబ పరువు, ప్రతిష్ఠల మధ్య  బైండ్‌ అయిపోయింది! అందుకే కలహాలు, కలతలున్నా ఆ కాపురం సాగిపోతూనే ఉండింది! కానీ దాన్నిప్పుడు అమ్మాయిలు ప్రేమ,  కంపాటబిలిటీతో తిరగరాసేందుకు  ప్రయత్నిస్తున్నారు. 

గౌరవం, భావోద్వేగాలతో  బంధించాలనుకుంటున్నారు.  అయితే ఆ ప్రయాణంలో విడాకుల  అడ్డంకులు ఎదురవుతున్నాయి.  దాన్ని గమనిస్తున్న పెద్దలకు  మన వివాహ వ్యవస్థ  కూలిపోతున్నట్టనిపించవచ్చు!  కానీ.. ఒక వ్యవస్థను పునర్‌నిర్మించడంలో అలాంటివి సాధారణమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ తడబాట్లు సర్దుకుని పెళ్లిపుస్తకంలో కొత్త పేజీలుగా మారుతాయని చెబుతున్నారు!  

సుచరిత బిజినెస్‌ ఎనలిస్ట్‌. పెళ్లయి రెండేళ్లవుతోంది. భర్త సాఫ్ట్‌వేర్‌. పెళ్లయిన వెంటనే యూకేలో మంచి జాబ్‌ ఆఫర్‌ వస్తే.. పెళ్లిని నిలబెట్టుకోవడం కోసం ఆ జాబ్‌ ఆఫర్‌ని వద్దనుకుంది. ఓ స్టార్టప్‌ ప్లాన్‌ చేసుకుని ఈ రెండేళ్లలో దాన్ని బాగా డెవలప్‌ చేసుకుని ఆంట్రప్రెన్యూర్‌గా స్థిరపడే దశకు చేరుకుంది. ఆ క్రమంలో పిల్లలనూ అప్పుడే వద్దనుకుంది. భర్త మాత్రం పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఈ మధ్యే అతనికి అమెరికాలో మంచి జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. 

సుచరితనూ తీసుకుని అమెరికా వెళ్లిపోతే పిల్లల కోసం కన్విన్స్‌ అవుతుందనుకుని ఆ జాబ్‌కు ఓకే చేసి ఇక్కడున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, సుచరిత ముందు తన ప్రపోజల్‌ పెట్టాడు. తను స్టార్టప్‌ను వదిలేసి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. చర్చలు, వాదనలు జరిగాయి. ‘పెళ్లయిన కొత్తలోనే ఇప్పుడు నీకొచ్చిన జాబ్‌ ఆఫర్‌ కన్నా రెట్టింపు శాలరీతో మంచి ఆఫర్‌ నాకు వచ్చింది.

 కానీ మన పెళ్లిని ప్రొటెక్ట్‌ చేసుకోవడానికి ఆ జాబ్‌ను వద్దనుకున్నాను. ఇప్పుడు నా స్టార్టప్‌ క్లిక్‌ అయ్యింది. ఇంత ఎఫర్ట్‌నీ తుంగలో తొక్కి నీతో రమ్మంటే రాలేను. కావాలంటే నువ్వు నా కంపెనీలో చేరు. ఇద్దరం కలిసి పనిచేద్దాం!’ అంది. ససేమిరా అన్నాడు. మన బంధానికన్నా నీకు ఆ స్టార్టప్పే ఎక్కువ?  నీ కెరీర్‌ కోసం మదర్‌హుడ్‌ని కూడా పణంగా పెడతావా?’ అంటూ నిలదీశాడు. ఆ మాటలకు, ఆ ఆలోచనా ధోరణికి విస్తుపోయింది సుచరిత.

‘నేనేం పిల్లలను వద్దనుకోవట్లేదు. నీ అమెరికా జాబ్‌ కోసం నా కెరీర్‌ను వదలను అంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. పిల్లల కోసమూ ప్లాన్‌ చేసుకుందాం’ అంది. రాజీకి రాలేదు అతను. అయితే విడాకులు కావాలంది సుచరిత. ఆమె నిర్ణయానికి అటు పెద్దలు, ఇటు పెద్దలు హతాశులయ్యారు. మూర్ఖత్వంతో కాపురాన్ని కూల్చుకుంటున్నావంటూ తిట్టారు. అయినా చలించలేదు సుచరిత. 

కూతురి తీరుకు ఏడుస్తున్న తల్లిని ‘నన్నెవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు నువ్వు అపార్థం చేసుకోవడమే పెయిన్‌గా ఉందమ్మా! బాగా చదువుకోవాలి, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, కోట్ల ఆస్తి ఉన్న భర్త దొరికినా సరే.. నీకంటూ రూపాయి సంపాదించుకున్నప్పుడే నీకు ధైర్యం, గౌరవమని నువ్వు చెప్పిన మాటల్ని నువ్వే మరచిపోయావా? ఆ గోల్‌ కోసం నేను పడ్డ కష్టాన్ని నువ్వూ ఇగ్నోర్‌ చేయడమేంటమ్మా..’ అంటూ బాధపడింది. అమ్మకు అర్థమైంది, అలాగని కూతురిని పూర్తిగా సమర్థించలేకపోయింది.

ఎందుకంటే.. 
ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చిన్నప్పటి నుంచీ నూరిపోసిన ఆ తల్లి ఆడపిల్లకు కాపురం కూడా అంతే ముఖ్యం, అవసరమైతే అంతకన్నా ముఖ్యమనే సంప్రదాయ విలువలకు కండిషనింగ్‌ అయి ఉంది. ఆ భావజాలం కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి అడ్డం పడుతోంది. తన పెంపకం పట్ల అపరాధ భావాన్నీ కలిగిస్తోంది. ఆమే కాదు ఆడపిల్లల చదువును, ఉన్నతిని కాంక్షించి ఆ దిశగా వాళ్లను తీర్చిదిద్దిన చాలామంది తల్లిదండ్రులదీ అదే భావన. పెళ్లిని నిలుపుకోవడం కోసం చదువును, కెరీర్‌ను ఆడపిల్లలే పణంగా పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఎంతకాదన్నా మన దగ్గర పెళ్లి సఫరింగ్‌నే గ్లోరిఫై చేస్తోంది కాబట్టి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. బాధ పడుతున్నా.. హింసను ఎదుర్కొంటున్నా, మానసిక దూరం పెరుగుతున్నా, భావోద్వేగాలు నిర్లక్ష్యం అవుతున్నా ఆలుమగలు కలిసి ఉండాలనే నేర్పుతోంది కుటుంబం. 

కానీ..
చదువు, లోకజ్ఞానం, సాధికారత ఇచ్చిన ధైర్యంతో అలాంటి కాపురంలో కొనసాగడం కన్నా విడాకులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు సుచరితలాంటి అమ్మాయిలు. ఎమోషనల్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ లేని పెళ్లిని పెళ్లిగానే చూడట్లేదు. విడాకులను పెద్దవాళ్లు పరువుప్రతిష్ఠలకు ముడిపెడతారు. ఆ భావన నుంచి బయటపడాలి. భరిస్తూ కలిసి బతకడంలో అర్థం లేదు. విడిపోయినా ఆత్మగౌరవంతో బతకడంలోనే ఆనందముందని గ్రహించాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమైనా సరే సహనంతో సర్దుకుపోవాలంటూ పిల్లలను బలవంత పెట్టకూడదని మానసిక, న్యాయ నిపుణులూ చెబుతున్నారు. ఇది సంప్రదాయాన్ని మంటగలుపుతున్న మార్పు కాదు. పరిణామ క్రమమని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. 
 

విడాకులకు కారణాలు..  
మునుపటిలా ఆడవాళ్ల పని, మగవాళ్ల పనంటూ బాధ్యతలను జెండర్‌ కోణంలో చూడట్లేదు. ఇంటా, బయటా స్త్రీ, పురుషుల విధుల్లో మార్పులొచ్చాయి. మారిన ఈ విలువలను జీర్ణించుకోలేని కాపురాలు విడాకుల బాట పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్‌ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, బంధంలో భావోద్వేగాల సమన్వయం లోపించడం, నమ్మకం లేకపోవడం, అభద్రత, అస్తవ్యస్త పనివేళలు, మద్యం, ధూమపానం మొదలైనవీ విడాకులకు ప్రధాన కారణాలే అంటున్నాయి అధ్యయనాలు. 

ఈ మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడింతలయ్యాయి. పురుషాధిపత్య సమాజాలుగా పేరొందిన ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య, వేరు పడిన సంసారాల సంఖ్యా తక్కువగా ఉన్నాయి.

పెళ్లి, పిల్లలు,పేరెంటింగ్, విడాకులు, ఆందోళన వంటివన్నీ మనదాకా వస్తేగానీ తెలియవు. కాలం కలిసి వచ్చినప్పుడు అంతా బ్రహ్మాండంగా సాగుతూ మనంత తెలివిగల వాళ్లు లేరనిపిస్తుంది. కాలం ఎదురు తిరిగినప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది.
– కరీనా కపూర్‌

భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్‌ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్‌ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.
– విద్యా బాలన్‌ 

– సరస్వతి రమ

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)