Breaking News

Sagubadi: హోమియోతో చీడపీడలకు చెక్‌!

Published on Tue, 01/13/2026 - 05:59

వరి, మిరప వంటి పంటలతో పాటు మామిడి తదితర పండ్ల తోటల్లోనూ పురుగులు, తెగుళ్ల యాజమాన్యానికి హోమియో మందులు అత్యంత ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఈ రంగంలో పదిహేనేళ్లుగా విశేష కృషి చేస్తున్న ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు జిట్టా బాల్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని తన పరిశోధనా క్షేత్రంలో అగ్రి హోమియోపతిపై బాల్‌రెడ్డి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తొలుత తన క్షేత్రంలో వాడి, మంచి ఫలితాలు కనిపించిన తర్వాత ఆయన ఈ మందులను రైతులకు సూచిస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెప్పే లక్ష్యంతో ‘అమేయ కృషి వికాస కేంద్రం’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వీడియోలను కూడా ఆయన రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. హోమియో మందులతో వ్యవసాయంపై ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

మిరపలో చీడపీడలకు హోమియో మందులు
నల్లపేను (వెస్ట్రన్‌ బ్లాక్‌ త్రిప్స్‌)– ఆర్నేరియా డయాడెమా 30; రింగ్‌ స్పాట్‌ వైరస్‌ (బొబ్బర) – నెట్రమ్‌ సాలిసికమ్‌ 30, సాలిసిక్‌ ఆసిడ్‌ 30; ఎల్లో మొజాయిక్‌ వైరస్‌– జింజింబర్‌ 30, వాలెరినా 30; బూడిద తెగులు, కొమ్మెండు తెగులు– కూప్రమ్‌ మెటాలికమ్‌ 30; వేరుకుళ్లు, కాయకుళ్లు, కాండంకుళ్లు– బావిస్టా 30; తెల్లదోమ, పచ్చదోమ– కోక్సినెల్లా 30, సోరినమ్‌ 30; తుప్పు తెగులు, కాయ మచ్చ– బెల్లడోనా 30, కాల్కేరియాకార్బ్‌ 30; మెగ్నీషియం లోపం– మ్యాగ్‌ఫాస్‌ 30; జింక్‌ లోప నివారణ– జింకమ్‌మేట్‌ 30; బోరాన్‌ లోప నివారణ– బోరాన్‌ 30; లద్దె పురుగు– నక్స్‌వామికా 30, అజారిక్టా ఇండికా 30; తెల్ల లద్దె పురుగు, జపానీస్‌ బీటిల్‌– తూజా 30; పూత రాలటం– బావిస్టా 30; పూతరాలటం, వాతావరణ మార్పు– పెర్రంమేట్‌ 30; ఎదుగుదల లోపం, గిడసబారటం– కార్బోవెజ్‌ 30; దెబ్బతిన్న పంట కోలుకోవడానికి– బయోవేరా డిప్యూజా 30; పూత రాలకుండా– సికిల్‌ కార్‌ 30; పూత రావడానికి– అస్పగరిస్‌ 30 మందులను పిచికారీ చేసుకోవాలి.

మామిడి
మామిడి పూత రావటానికి – కాలి నైట్రికం 30, పల్సటిల్ల 30; పిందె రాలిపోకుండా – బావిస్టా 30; పచ్చదోమ/తెల్లదోమ నివారణకు – కోక్సినెల్లా 30, సోరినం 30 లేదా కోక్సినెల్లా 30, సల్ఫర్‌ 30 లేదా సోరినం 30, సల్ఫర్‌ 30; కాయ పెరుగుదలకు, తీపికి – ఆక్సాలిక్‌ ఆసిడ్‌ 30; సూటి మోల్డ్‌– సోరినం 30; బ్యాక్టీరియా మంగు– నాట్రం సాలిసికం 30, సాలిసిక్‌ ఆసిడ్‌ 30; పిందె దశలో త్రిప్స్, మైట్స్‌ నియంత్రణకు– తూజ 30; కాయకు కవరు కట్టే ముందు– సల్ఫర్‌ 30, సోరినం 30 వేర్వేరుగా పిచికారీ చేయాలి.

కొబ్బరి 
కొబ్బరిలో కాపు తెప్పించటానికి, కాయ రాలకుండా 
నిలబెట్టుకోవటానికి రెండు కొత్త హోమియో మందులను తయారు చేసుకొని వాడాం. పూతలో 3 వంతుల కాపును నిలబెట్టుకున్నాం. కొబ్బరి చెట్లకు రెండు రకాల మందులు వాడుకోవాలి. గెలలు రావటానికి ఒకటి, కాయలు రాలకుండా కాపాడుకోవటానికి మరొకటి వేర్వేరుగా వాడుకోవాలి. 30 లీటర్ల నీటిలో 30 ఎం.ఎల్‌. మందు కలిపి వాడాలి. గడ్డపారతో చెట్టు చుట్టూ 4,5 నేలలో బొరియలు చేసి, వాటిలో పోయాలి. పది రోజులకోసారి వరుసగా 3 నెలలు వాడితే మంచి ఫలితం వస్తుంది. 6 నెలల తర్వాత మళ్లీ ఇవ్వొచ్చు. ఈ రెండు మందులు బయట దొరకవు. వీటితోపాటు 15 రోజులకోసారి పేడ ద్రావణం కూడా పోస్తున్నాం. తెల్లదోమ నివారణకు కోక్సినెల్లా 30, రెండు రోజులకు సల్ఫర్‌ 30, వారంలోగా సెమ్సిఫోగా 30, సల్ఫర్‌ 30 పిచికారీ చేసుకోవాలి.

నత్తల నివారణకు..
అధిక వర్షాల నేపథ్యంలో వరి, అనేక కూరగాయలు, బొప్పాయి తదితర పండ్ల తోటలకు కూడా ఆఫ్రికా నత్త బెడద ఏర్పడింది. నత్తల నివారణకు 20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్‌. హెలిక్స్‌ టోస్టా 30 మందును కలిపి పిచికారీ చెయ్యాలి. ఒక స్ప్రే సరిపోతుంది. మరీ అవసరమైతే 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేస్తే చాలు.

వరి
20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్‌. శైలీషియా 30 మందును కలిపి వరి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తర్వాత మైకోరైజా పట్టించి మండె కట్టి నారు పోసుకోవాలి. ఇనుప ధాతువు లోప నివారణకు– ఫెర్రంమెట్‌ 30;  నారు ఎర్రబారినప్పుడు– కార్బొవెజ్‌ 30; నాటేసిన మొక్క నిలదొక్కుకోవటానికి కాలెండుల్లా 30; వేరుకుళ్లుకు– బావిస్ట 30; మొగి పురుగు, తెల్లకంకి నివారణకు– నాటేసిన 20 రోజులకు ఒకసారి, చిరుపొట్ట దశ­లో మరోసారి తూజ 30; పాముపొడ, పచ్చ పురుగు– నక్స్‌ వామిక 30; దోమపోటు– కోక్సినెల్ల 30 ( మరీ అవసరమైతే సింసిఫ్యూగ 30, సోరినమ్‌ 30 వేర్వేరుగా వా­డా­లి); పోషకాల లోపనివారణ– పేడ ద్రా­వ­ణం, డీఏపీకి బదులు– అమ్మోనియా ఫాస్‌ 30, యూరియాకు బదులు– యూరి­యా పోరిక 30; పొటాష్‌కోసం– కాలిమూ­ర్‌ 30; జింక్‌ లోప నివారణకు– జింకం మేట్‌ 30; స్మట్‌ – తూజా 30, అగ్గితెగులు­–బెల్లడోనా 30, కాల్కేరియా కార్బ్‌ 30 పిచి­కారీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

పంటలకు హోమియో మందులను 30కన్నా తక్కువ పొటెన్సీలోనే వాడాలి
ద్రవ రూప హోమియో మందులు ప్రత్యేక హోమియో దుకాణాలలో లభిస్తాయి. ఒకే హోమియో మందు అనేక పొటెన్సీలలో అందుబాటులో ఉంటుంది. పంటలకు సూచించిన హోమియో మందులను 6 లేదా 12 లేదా 30 పొటెన్సీ కలిగినవి మాత్రమే వాడుకోవాలి. 6 లేదా 12 పొటెన్సీలు అందుబాటులో లేనప్పుడు 30 పొటెన్సీ హోమియో మందులు వాడుకోవటం ఉత్తమం. అంతకన్నా ఎక్కువ పొటెన్సీ గల మందులు వాడకూడదు. అవసరం కూడా లేదు. హోమియో మందులు ఏ రెంటినీ కలిపి చల్లకూడదు. దేనికి దానికే వాడుకోవాలి. మోతాదు కూడా 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్‌. మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే దుష్ఫలితాలు వస్తాయి. హోమియో మందుల వల్ల సాధారణంగా ఎటువంటి దుష్ఫలితాలు రావటం ఉండదు. ఇతర వివరాలకు నా యూట్యూబ్‌ చానల్‌ అఝ్ఛy్చ జుటజీటజిజీ Vజీజ్చుట్చ జ్ఛుnఛీట్చఝ లో వీడియోలు చూడవచ్చు.  పంటలకు హోమియో మందులను కొత్తగా వాడే రైతులు ముందు ఒక ఎకరంలో వాడి చూసుకొని ముందుకు వెళ్లాలని సూచన.  
 

20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్‌. మందు చాలు
ద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు ప్రత్యేక పద్ధతిని పాటించటం అవసరం. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి,  సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎంఎల్‌ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలక్కొట్టినట్టు ఉపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని 20 లీటర్ల థైవాన్‌  స్పేయర్‌ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్‌. కంటే ఎక్కువ మందు వాడవద్దు. 

అలా చేస్తే మందు పనిచేయదు. స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే  ఫలితాలు వస్తాయి. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్పేయర్‌ను, బాటిళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయి. వీలుంటే హోమియో మందును పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్‌ను వాడుకుంటే మంచిది. సూచించిన మందులను ఒక్కసారి (సింగిల్‌ డోస్‌) పిచికారీ చేస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుంది. మరీ అవసరమైతే రెండోసారి చాలు.  

– జిట్టా బాల్‌రెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా

Videos

కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

వర్మకు పవన్ అవమానం.. రగిలిపోతున్న పిఠాపురం

YSRCP మొసలి కన్నీరు కరుస్తుందా.. అదిరిపోయే కౌంటర్ కుమార్ యాదవ్

అల్లు అర్జున్ మూవీ లైనప్..

ప్రభాస్ గురించి తెలియని నిజాలు..! సోషల్ మీడియా షేక్ అవుతుందిగా

మన శంకరవరప్రసాద్ తర్వాత, ఏ హీరోతో అనిల్ రావిపూడి చిత్రం చేస్తాడు?

బాబుకు బిగ్ షాక్ హైకోర్టుకు స్కిల్ స్కామ్ కేస్?

Garam Garam Varthalu: కలెక్షన్ కింగ్

Garam Garam Varthalu: కొడుకు మీద ప్రేమతో

KSR: రాజ్యసభ సీటు కోసం బేరసారాలా?

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)