Breaking News

చిరుధాన్యాలను ఎలా విత్తుకుంటే మేలు...?

Published on Tue, 06/03/2025 - 11:35

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌)లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విత్తుకోవటానికి అనువైన 11 రకాల చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తు న్నారు. జొన్నలు, పచ్చజొన్నలు ఎకరానికి 3 కిలోలు విత్తుకోవాలి. ఇతర చిరుధాన్యాలన్నీ ఎకరానికి 2 కిలోలు సరిపోతాయని, ఎకరానికి సరిపోయే విత్తనంతో బ్యాగ్‌లను సిద్ధం చేశామని ఐఐఎంఆర్‌ విత్తన విభాగం సాంకేతిక అధికారి రఘునాద్‌ కులకర్ణి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 

వరుసలుగా విత్తుకుంటే మేలు: చిరుధాన్య పంటలను వెదజల్లటం కాకుండా వరుసలుగా విత్తుకోవటం మేలు. కూలీలతో కలుపు తీయిస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. వరుసలుగా విత్తుకుంటే యంత్రాలతో అంతరసేద్యం చేస్తూ కలుపును నిర్మూలించుకోవచ్చు. సాధారణంగా వరుసల మధ్య 22.5 సెం.మీ. దూరం పెడతారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న వీడర్‌ యంత్రాల వెడల్పును బట్టి సాళ మధ్య దూరాన్ని నిర్ణయించుకోవచ్చు. అవసరాన్ని బట్టి 30 సెం.మీ. / 40 సెం.మీ. / 45 సెం.మీ. వరకు కూడా సాళ్ల మధ్య దూరం పెట్టుకోవచ్చని రఘునాద్‌ వివరించారు. 

ఇదీ చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది

∙జొన్న (దేశీ రకం/ హైబ్రిడ్‌), పచ్చజొన్న, పచ్చిగడ్డి కోసం పెంచే జొన్న ఎకరానికి 3 కిలోలు విత్తుకోవాలి. ∙సజ్జ, రాగు (కెఎంఆర్‌ 301), కొర్ర (సూర్యనంది), సామ (సిఎల్‌ఎంవి1), ఊద (డిహెచ్‌బిఎం93–3), వరిగ (టిఎన్‌ఎయు 202), అరిక (సికెఎంవి2), అండుకొర్ర (హెచ్‌బిఆర్‌2)లను ఎకరానికి 2 కిలోలు విత్తుకోవాలి. ఈ విత్తనాలు ఐఐఎంఆర్‌లో అందుబాటులో ఉన్నాయి. రైతులు స్వయంగా వచ్చి కొనుక్కెళ్లాలి. ఇతర వివరాలకు.. 040–24599305. 

చదవండి: కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’

చిరుధాన్యాల విత్తనాలు దొరికే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు: 
నంద్యాల (99896 25208), పెరుమామళ్లపల్లి (87906 38715)
పాలెం (97050 69580)లలోని కూడా కొన్ని రకాల చిరుధాన్య పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయి.
ఐఐఎంఆర్‌లో 11 రకాల చిరుధాన్యాల విత్తనాలు సిద్ధం 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు