Breaking News

4 వేల లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవుల గురించి తెలుసా?

Published on Tue, 11/11/2025 - 12:31

హోల్‌స్టీన్‌ ఫ్రైసియన్, సాహివాల్‌ జాతుల కలయికతో రూపొందిన సంకరజాతి కొత్త ఆవుల జాతి ‘ఫ్రైస్వాల్‌’ (Frieswal). ఇప్పటికి ఉన్న గోజాతులన్నిటికన్నా అత్యధికంగా ఒక ఈత కాలంలో 4 వేల కిలోల పాల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌)కు అనుబంధంగా మీరట్‌లోని కేంద్రీయ పశు పరిశోధనా సంస్థ (సీఐఆర్‌సీ) మిలటరీ ఫామ్స్‌ సర్వీస్‌ సంయుక్తంగా ఈ కొత్త పాడి పశుజాతిని రూపొందించాయి. ఇందులో హెచ్‌.ఎఫ్‌. గుణా­లు 62.5%, సాహివాల్‌ గుణాలు 37.5% ఉంటాయి. అధిక పాల దిగుబడినిచ్చే హెచ్‌.ఎఫ్‌. గుణాలతో పాటు దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని మంచి ఫలితాలను ఇవ్వగలిగిన దేశీ గోజాతి సాహివాల్‌ లక్షణాలను ఫ్రైస్వాల్‌ పుణికిపుచ్చుకుంది. ఈనిన తర్వాత 300 రోజుల్లో 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్‌ ఆవు ఇస్తుందని ఐసీఏఆర్‌ ప్రకటించింది. 

పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ఫ్రైస్వాల్‌ జాతి అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 42 మిలటరీ ఫామ్స్‌లో పరిశోధనలు జరిగాయి. సైనికులకు మేలైన పాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మిలటరీ డెయిరీ ఫామ్స్‌ సరికొత్త సంకరజాతి గోజాతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. కొత్త పశు జాతిని అభివృద్ధి చెయ్యటం కోసం శాస్త్రవేత్తలు సుమారు 4 దశాబ్దాల పాటు శ్రమించారు. 1984 సెప్టెంబర్‌ 4న ప్రారంభమైన ఫ్రైస్వాల్‌ పరిశోధనలు కొద్ది నెలల క్రితమే పూర్తయ్యాయి. ఈ పరిశోధన ప్రాజెక్టు కోసం రూ. 800 కోట్లు ఖర్చయ్యాయి. ఈ బ్రీడ్‌ ఆవులు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి ‘హెచ్‌ఎఫ్‌ సాహివాల్‌’ అనే పేరుతో ఈ ఆవులు రైతులకు అందుబాటులో వున్నాయి. అయితే ఈ బ్రీడ్‌కు కొత్తగా ‘ప్రైస్వాల్‌’ అని పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చదవండి: పొట్టి ఆవులు గట్టి మేలు!
20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం


 


 

#

Tags : 1

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)