Breaking News

పశువైద్యంలో యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం

Published on Tue, 02/03/2026 - 06:30

పశువ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని 90% వరకు తగ్గించే సాంప్రదాయ మూలికా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసిన తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్  డా. ఎన్‌. పుణ్యమూర్తి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఎత్నో–వెటర్నరీ మెడిసిన్‌ (ఈవీఎం)లకు శాస్త్రీయ ప్రామాణికతను నిరూపించటంలో, రైతుల చెంతకు చేర్చటంలో డా. పుణ్యమూర్తి విశేష కృషి చేశారు. 

యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) మహమ్మారికి అసలైన పరిష్కారం ఈవీఎం చికిత్సలేనని డా. పుణ్యమూర్తి తెలిపారు. యాంటీబయాటిక్స్‌ అవసరం లేకుండానే పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి తీవ్ర జబ్బులను ఈవీఎం చికిత్సలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రీయ పరీక్షలతో పాటు రైతుల అనుభవంలోనూ రుజువైందన్నారు. 

తమిళనాడు తంజావూరు సమీపంలోని వల్లం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పశువైద్యంలో డాక్టరేట్‌ చేసి, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ డీన్‌గా పనిచేసిన ఆయన 2001లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా బెంగళూరులోని టీడీయూ హెల్త్‌సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీతో కలిసి పరిశోధనలు కొనసాగించారు. యాంటీబయాటిక్స్‌ తదితర రసాయన ఔషధాలపై ఆధారపడకుండా తమ ఇంట్లోని దినుసులతోనే పశువ్యాధులకు రైతులే స్వయంగా చికిత్స చేసుకోవటానికి వీలుగా ఉండటం ఈవీఎంల ప్రత్యేకత. సిద్ధ వైద్య సూత్రాల ఆధారంగా సుమారు 50కి పైగా పశు వ్యాధులకు ఈవీఎం పద్ధతులను ఆయన రూపొందించారు. వీటి పనితీరును నిర్ధారించుకున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ) దేశవ్యాప్తంగా పశుపోషకులకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సిఫారసు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసింది. సంబంధిత చికిత్సల వీడియోలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్‌డీడీబీ యూట్యూబ్‌ చానల్‌లో అందుబాటులో ఉన్నాయి.

స్వచ్ఛమైన పాలు, గుడ్లు, పేడ, మూత్రం ఉత్పత్తే లక్ష్యం: డా. పుణ్యమూర్తి 
‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్‌ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు.

‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్‌ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. 
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)