Breaking News

16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?

Published on Fri, 08/22/2025 - 14:07

ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్‌ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్‌ దక్కించుకున్న ఈ స్వీట్‌ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్‌ ‍‍స్వీట్‌ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్‌. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్‌ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..

ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్‌ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. 

బ్రెడ్‌, ఎనర్జీ బార్‌లు, చాక్లెట్లు సూప్‌ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్‌ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో  ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. 

హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్‌, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది.

 

(చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..)

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)