Breaking News

వాటర్‌ ఫిల్టర్‌ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!

Published on Sat, 05/03/2025 - 12:23

ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ ఆర్వోల ను వినియోగించడం పెరిగిపోయింది. ఆర్వో వాటర్‌ ఆరోగ్యానికి మంచో చెడో అనే విషయాన్ని పక్కన పెడితే... వీటి వినియోగంలో గ్లాసు నీటి శుద్ధికి నాలుగు గ్లాసుల నీరు వృథా అవుతుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఫరవాలేదు కానీ అవి అడుగంటిపోయి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే వారికి ఆర్వోల వినియోగంలో అయ్యే నీటి వృథా ఒక ఇంజినీర్‌కు మంచి ఐడియానిచ్చింది. అది నీటి వృథాకు చెక్‌ చెప్పింది. 

ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి మహానగచాలలో రోజువారీ అవసరాల కోసం నీటిని కొనుక్కోవటం గతంలో వేసవికాలానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఏడాదిలో రెండు మూడు నెలలు మినహా అన్ని కాలాలు అదే దుస్థితి. ఆర్వోలు వినియోగించడం అనివార్యం అయిపోయింది. 

ఇదీ చదవండి: Summer Care సన్‌స్క్రీన్‌ వాడాలా? వద్దా?

బెంగళూరు నివాసి ప్రభాత్‌ విజయన్‌ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. హోరామావులో నివసిస్తున్న 45 ఏళ్ల ఈ టెక్‌ మేనేజర్‌ తన ఇంట్లో ఉపయోగిస్తున్న వాటర్‌ ప్యూరిఫయర్‌ ద్వారా గ్లాసు శుభ్రమైన నీటికి నాలుగింతల నీరు వృథా కావడాన్ని గమనించాడు. ఈ వృథా నీరు ఎలాంటి ఉపయోగమూ లేకుండా నేలలో కలిసిపోవడం అతన్ని తీవ్రంగా బాధించింది. వెంటనే దీనికి ఓ పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు. ఒక డ్రమ్ము, స్క్రూడైవర్‌ ఆయుధాలుగా వెంటనే ఆ ఆలోచనను కార్యాచరణలో పెట్టాడు. 

చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా

నీరు సమృద్ధిగా ఉండే కేరళలోని అలెప్పీకి చెందిన ప్రభాత్, ప్రతి చుక్కకు డబ్బు చెల్లించాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కానీ 2014లో బెంగళూరుకు వెళ్లాక పరిస్థితి మారి΄ోయింది. అతనుండే అపార్ట్‌మెంట్‌లో రోజువారీ అవసరాల కోసం కచ్చితంగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఒక్కో ట్యాంకర్‌ ధర రూ.1,000. అదే సమయంలో వాటర్‌ ప్యూరిఫయర్‌ ద్వారా పెద్దమొత్తంలో నీరు వృథా అవుతుండటం అతని దృష్టికి వచ్చింది. ఈ పరికరం ద్వారా ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని అనిపించింది. ఈ ప్రక్రియలో ఉపయోగించే రివర్స్‌ ఆస్మాసిస్‌ గురించి అధ్యయనం చేశాడు. ఈ విధానంలో ప్రతి లీటరు నీటికి నాలుగురెట్ల నీరు వృథా కావడం తప్పనిసరని అర్థం చేసుకున్నాడు. నీటి కొరత, అర్ట్‌ మెంటు వాసుల ఆందోళన, ఈ సమస్యతో స్వయంగా తాననుభవిస్తున్న కష్టం... ఇవన్నీ ప్రభాత్‌ను పరిష్కారం దిశగా ప్రేరేపించాయి. అందుకే ప్యూరిఫయర్‌ లో వృథా అవుతున్న నీటిని  తిరిగి వినియోగించుకోవడానికి ఒక సెటప్‌ను రూపొందించాడు.   

రివర్స్‌ ఆస్మాసిస్‌ (ఆర్‌. ఓ.) అంటే...
రివర్స్‌ ఆస్మాసిస్‌ అనేది నీటి శుద్ధీకరణలో ఒక  పద్ధతి. నీటిలోని మలినాలు, క్లోరిన్, లవణాలు, ధూ«ళి ఇతర కలుషితాలను సెమీ–పెర్మెబుల్‌  పొరతో ఫిల్టర్‌ చేస్తారు.

నీటి వృథా నుంచి-పునర్వియోగం దిశగా... 
∙ప్రభాత్‌ 50–లీటర్‌ డ్రమ్మును తన ఇంటిలో ఒక మూలన రెండు చదరపుటడుగుల స్థలంలో ఉంచారు. 

స్క్రూడ్రైవర్‌తో డ్రమ్‌ మూతకు ఒక చిన్న రంధ్రం చేసి డిశ్చార్జ్‌ పైపును చొప్పించాడు. దీన్ని ప్యూరిఫయర్‌కు అనుసంధానించడం ద్వారా డ్రమ్‌లోకి వచ్చి చేరిన నీటిని పాత్రల శుభ్రం, టాయిలెట్‌ క్లీనింగ్, ఇల్లు తుడవడం, గార్డెనింగ్‌కు ఉపయోగించడం మొదలుపెట్టాడు. 

సింపుల్‌గా.... ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇప్పుడతను స్మార్ట్‌గా వృథా నీటిని రీయూజ్‌ చేస్తున్నాడు. ‘‘ప్రస్తుతం నేను రూ పొందించిన ఈ వ్యవస్థతో నెలకు కేవలం మా ఇంటినుంచే ఆరు పూర్తి నీటి ట్యాంకర్లకు సమానమైన నీటిని ఆదాచేస్తున్నాం. ఆ ఖర్చును మిగుల్చుకున్నాం. ఇప్పుడు ఇది మా కుటుంబ జీవన విధానంగా మారింది’’ అని సంతోషంగా చెప్పాడు. 

బాగుంది కదూ... మనం కూడా ఇలా స్మార్ట్‌గా ఆలోచిస్తే నీటి వృథాకు చెక్‌ చెప్పవచ్చు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు