Breaking News

కంఫర్ట్‌ ఫుల్‌... స్టయిల్‌ డబుల్‌!

Published on Sun, 06/21/2026 - 08:32

ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్‌గా కనిపించాలంటే, కొరియన్‌  ఫ్యాషన్‌ ను ఫాలో అవ్వాల్సిందే! ముఖ్యంగా కొరియన్‌ డ్రామాల ప్రభావంతో ఇప్పుడు ట్రెండ్‌ మొత్తం కంఫర్ట్‌ అండ్‌ క్లాస్‌ కలిసిన రిలాక్స్‌డ్‌ ఫిట్‌ ప్యాంట్స్‌వైపు మళ్లింది. అందుకే, ఈ కొరియన్‌  ప్యాంట్స్‌ గైడ్‌ మీ కోసం!

ప్లీటెడ్‌ ప్యాంట్స్‌కి క్లాస్‌ వేరు
ప్లీటెడ్‌ డిజైన్స్‌ ఈ ఫ్యాషన్‌  ప్రపంచంలో ఫుల్‌ డిమాండ్‌లో ఉన్నాయి. ముందు భాగంలో చిన్న కుచ్చులు ఉండే ప్లీటెడ్‌ ప్యాంట్స్‌కు, ఒక ప్లెయిన్‌  షర్ట్‌ లేదా పోలో టీషర్ట్‌తో జత చేస్తే చాలు... ‘ఈయనకి ఫ్యాషన్‌  గురించి తెలుసు’ అనే ఫీలింగ్‌ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.

యాంకిల్‌ లెంగ్త్‌ కిక్‌
చీలమండ దగ్గర ముగిసే కొరియన్‌  ప్యాంట్స్‌ చాలా స్టయిల్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా వైట్‌ స్నీకర్స్‌తో వేసుకుంటే లుక్‌ మరింత షార్ప్‌గా మారుతుంది.

న్యూట్రల్‌ కలర్స్‌నే హీరోలు
బీజ్, క్రీమ్, గ్రే, ఆలివ్, బ్లాక్, నేవీ... ఇవే కొరియన్‌  ఫ్యాషన్‌ లో ఎక్కువగా కనిపించే కలర్స్‌. వీటిని మ్యాచ్‌ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే స్టయిల్‌ చేయడంలో టెన్షన్‌  తక్కువ.

ఓవర్‌సైజ్డ్‌ టీషర్ట్‌తో బెస్ట్‌ ఫ్రెండ్స్‌
కొరియన్‌  ప్యాంట్స్‌కి ఓవర్‌సైజ్డ్‌ టీషర్ట్‌తో వేసుకుంటే కొరియన్‌  స్ట్రీట్‌ స్టార్‌లా, షర్ట్‌ను టక్‌ చేసి బెల్ట్‌ జోడిస్తే డ్రామా హీరోలా కనిపించడం మాత్రం గ్యారంటీ!

అసలు స్పెషాలిటీ ఏంటంటే?
కొరియన్‌  ప్యాంట్స్‌ అంటే కాళ్లకు ఫ్రీడమ్, లుక్‌కి క్లాస్‌! ఇవి మరీ స్కిన్నీగా అతుక్కుపోవు, అలాగని గాలికి బెలూన్‌లా ఊగిపోవు. నడుము దగ్గర నీట్‌గా ఫిట్‌ అవుతూ, కిందికి వెళ్లేకొద్దీ రిలాక్స్‌డ్‌గా ఫ్లో అవుతాయి. నడుస్తుంటే గాలి కూడా హ్యాపీగా ఆడుతుంది, స్టయిల్‌ కూడా తగ్గదు. అలా కంఫర్ట్‌ ఫుల్‌... స్టయిల్‌ డబుల్‌!

ఈ 3 రూల్స్‌ గుర్తుంచుకోండి!

  • కింద వేసుకునే ప్యాంటు లూజ్‌గా ఉన్నప్పుడు, పైన వేసుకునే షర్ట్‌ లేదా టీ–షర్ట్‌ను ఇన్‌–షర్ట్‌  చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ బాడీ షేప్‌ కరెక్ట్‌గా ఎలివేట్‌ అవుతుంది. లేదంటే మీరు బట్టల మూటలా కనిపిస్తారు.

  • కొరియన్‌  లుక్‌ సీక్రెట్‌ సింప్లిసిటీ. ఎక్కువ ప్రింట్స్, ఎక్కువ కలర్స్‌ కంటే క్లీన్‌  అండ్‌ మినిమల్‌ లుక్‌కే ప్రాధాన్యం ఇవ్వండి..

  • ఈ ప్యాంట్స్‌ సాఫ్ట్‌ అండ్‌ ఫ్లోయీగా ఉంటేనే బాగుంటాయి. అందుకే కాటన్‌ బ్లెండ్స్, రేయాన్‌ లేదా లైట్‌–వెయిట్‌ సూటింగ్‌ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోండి.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)