రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
Breaking News
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
Published on Thu, 08/27/2026 - 10:39
తండ్రిని పాకెట్‌మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్‌కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..
అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్‌జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు.
నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం.
ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..
తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్‌ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.
అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్‌కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు.
పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్‌కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్‌క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి.
అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్‌వైడ్‌గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్‌లో గుర్తింపు పొందుతుండటం విశేషం.
(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్‌డీ..!)
Tags : 1