Breaking News

నాకు ఫొటో గ్రఫీ అంటే ఇష్టం

Published on Sun, 07/19/2026 - 01:20

‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌...’ అంటూ ఒకప్పుడు రవీనా టాండన్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘ఉయి అమ్మ...’ అంటూ ఆమె తనయురాలు రాషా తడానీ కుర్రకారు హార్ట్‌ బీట్‌ను పెంచింది. తొలి చిత్రం ‘ఆజాద్‌’తోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న రాషా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం కానుంది. ఈ యంగ్‌ హీరోయిన్‌ గురించి కొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...

‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలోని హీరోయిన్  పాత్ర (మంగ) కోసం దర్శక– నిర్మాతలు నాకు అవకాశం కల్పించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. జేకే (జయకృష్ణ ఘట్టమనేని) నా బెస్ట్‌ కో స్టార్‌. మోహన్ బాబు, వాసుగార్లు ఇలా టీమ్‌ అందరూ నాకు హెల్ప్‌ చేశారు. నాకు తెలుగు భాష పూర్తిగా రాదు. కొంచెం కొంచెం వచ్చు. అయితే తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మహేశ్‌బాబుగారికి అభిమానిని. అలాగే కృష్ణగారికి కూడా. తెలుగు ప్రేక్షకులు నా 
నటనను మెచ్చుకునేలా యాక్ట్‌ చేస్తాననే అనుకుంటున్నాను.

ఉయి అమ్మ... అని గట్టిగా అరిచాడు
‘ఆజాద్‌’ సినిమాలోని ‘ఉయి అమ్మ’ పాట నన్ను చాలా పాపులర్‌ చేసింది. ఒకసారి బిల్‌బోర్డ్‌పై ఉన్న నా సినిమా పోస్టర్‌ను నేను ఫోటో తీసేందుకు నా కారును ఆపి, కారు అద్దాన్ని కిందకి దించాను. అప్పుడు అక్కడే వీధిలో ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి... ‘అరే... ఈమె ఉయి అమ్మ’ అని గట్టిగా అరిచాడు. ఈ పాట నన్ను అంతలా ప్రేక్షకులకు చేరువ చేసింది.

నాన్న చాలా సపోర్ట్‌ చేస్తారు
మా నాన్న (డిస్ట్రిబ్యూటర్‌– నటుడు అనిల్‌ తడానీ) నన్ను చాలా సపోర్ట్‌ చేస్తుంటారు. నేను ఆర్టిస్ట్‌గా చేయాలనుకున్నప్పటికీ నాన్న చేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది. నా ఇంట్రస్ట్‌ని అర్థం చేసుకుని, నాన్న వ్యాపార మెలకువలు చెబుతుంటారు. అయితే మా అమ్మలానే నాన్న కూడా నా నిర్ణయాలను నన్నే తీసుకోమంటారు.  

మా అమ్మే స్ఫూర్తి
మా అమ్మ నటిగా పరిచయం అయినప్పుడు నాకంటే రెండేళ్లు చిన్నది. ఇప్పుడు నా వయసు 21. అంటే... అమ్మ స్క్రీన్‌కి పరిచయం అయినప్పుడు తనకు 19. ఇప్పుడున్నంత సౌకర్యాలు అప్పట్లో ఉండేవి కావని తను చెబుతుంటుంది. అది నిజమే. అప్పట్లో నటీమణులతో పోల్చితే ఇప్పుడు మాకు ‘వ్యానిటీ వాన్‌’ సౌకర్యం ఉంది. కష్టం విషయంలోనూ అప్పటివాళ్లతో పోల్చితే మాకు తక్కువే. మా అమ్మ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో కష్టపడింది. ఒక నటిగా ఆమె ప్రయాణం నాకు స్ఫూర్తినివ్వడమే కాకుండా, ఒక వ్యక్తిగా కూడా ఆమె నాకు స్ఫూర్తి. ’అందాజ్‌ అప్నా అప్నా’ సినిమాలో మా అమ్మ యాక్టింగ్‌ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నటించి, నేను చూసిన తొలి సినిమా కూడా ఇదే.

అద్దం ముందు నటన
మా అమ్మను కెమెరా ముందు చూడటం మొదలుపెట్టినప్పటి నుంచే నేను కూడా ఆర్టిస్ట్‌ అవ్వాలనుకున్నాను. నాకు క్రియేటివ్‌ జాబ్‌ అంటే చాలా ఇష్టం. స్కూలు రోజుల్లో సృజనాత్మక కళల పట్ల ఆసక్తి ఉండేది. అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటూ నాట్యం చేయడం, పాటలు పాడటం చేసేదాన్ని. పాడటం, పియానో ??వాయించడం చేస్తున్నట్లుగా నటించేదాన్ని. నటన అంటే అంత ఇష్టం ఉన్నప్పటికీ ఒకానొక దశలో నేను వెట్‌ (పశు వైద్యురాలు) కావాలని కూడా అనుకున్నాను. నాకు ఫొటోగ్రఫీ ఇష్టం. యానిమల్స్‌ ఫొటోలు తీయడం చాలా ఇష్టం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)