Breaking News

ఉత్సాహంగా 'సైకిల్‌ ఫర్‌ ఏ కాజ్‌'..!

Published on Tue, 07/22/2025 - 11:00

సామాజిక అభివృద్ధి, బాధ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నగరంలోని రాడిసన్‌ బ్లూ ప్లాజాలో ‘సైకిల్‌ ఫర్‌ ఏ కాజ్‌’ పేరుతో రైడ్‌ నిర్వహించారు. రాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌ సౌత్‌ ఆసియా చేపట్టిన ఈ ఈవెంట్‌లో 120 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. రాడిసన్‌ పీపుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక అభివృద్ధికి, అవగాహనకు మద్దతివ్వడంలో భాగంగా నిర్వహించిన ఈ రైడ్‌లో సైక్లిస్టులు రైడ్‌ ఫర్‌ హోప్‌ (3 కి.మీ), రైడ్‌ ఫర్‌ చేంజ్‌ (6 కి.మీ), రైడ్‌ ఫర్‌ ఇంపాక్ట్‌ (50 కి.మీ) వంటి మూడు విభాగాల్లో పోటీపడ్డారు. 

ఈ సందర్భంగా సంస్థ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ జోషి మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో దీనిని నిర్వహించామన్నారు. ఈ సైక్లోథాన్‌ కేవలం సైక్లింగ్‌ మాత్రమే కాదు, సమాజంలో నిజమైన మార్పే దీని ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు.  

నయనానందకరం అనుష్క నృత్యం
నాట్య గురువు ప్రమోద్‌రెడ్డి శిష్యురాలు చెరుకు అనుష్క భరతనాట్యం నయనానందకరమని ఐపీఎస్‌ అధికారి ఎం.రమేష్‌ అన్నారు. రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో అనుష్క అరంగేట్రం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయ నృత్యం పట్ల అవగాహన కల్పిచి శిక్షణ ఇప్పించాలని అన్నారు. 

ఓ వైపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ, మరోవైపు సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతి, వర్ణం, థిల్లాన, ప్రదోష సమయం వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శన అహూతులను ఆకట్టుకుంది. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, నాట్య గురువు అనుపమ కైలాష్, తల్లిదండ్రులు చెరుకు గోవర్ధన్‌రెడ్డి, అంజలి పాల్గొన్నారు.   

(చదవండి: కాశీ నేపథ్యంలో.. 'కైలాసవాస శివ'..)

#

Tags : 1

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)