Breaking News

నీతా అంబానీ ప్రసంగం: తండ్రీ కూతుళ్ల భావోద్వేగం

Published on Wed, 07/17/2024 - 12:07

బిలియనీర్‌  ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహవేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు,  దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులెవ్వరికీ ఏలోటూ లేకుండా చాలా శ్రద్ధ వహించి, శభాష్‌ అనిపించుకున్నారు నీతా అంబానీ. పెళ్లిలో అత్యంత కీలకమైందీ, ప్రతీ గుండెను ఆర్ద్రం చేసే సన్నివేశంలో కూడా నీతా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాధిక కన్యాదానం సమయంలో నీతా ఉద్వేగ ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది.

కొత్తకోడలు రాధిక మర్చంట్‌ను  తన  కోడలిగా ఆనందంతో  కుటుంబంలోకి స్వాగతించడమే కాకుండా, రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చంట్ , శైలా మర్చంట్‌లకు ఆమె భరోసా ఇచ్చిన తీరు  విశేషంగా నిలిచింది.   ‘‘కూతుర్ని ఇవ్వడం అంత తేలిక కాదు. తమ గుండెల్లో దాచుకుని పెంచుకున్న కూతుర్ని మెట్టింటికి పంపడం, ఆ భారాన్ని భరించడం కష్టం.  నేనూ ఒక కూతురిని, ఒక కూతురికి తల్లిని , అత్తగారిని. రాధికను మా కూతురిలా చూసుకుంటాం. ఆడపిల్లలే పెద్ద వరం. మన ఆడపిల్లలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ  కుమార్తెను మాకు ఇవ్వడం కాదు,  మరో కొడుకును, కొత్త కుటుంబాన్ని పొందారంటూ వారికి ధైర్యం చెప్పారు. అలాగే మీకు అనంత్‌ ఏంతో, మాకు రాధిక కూడా అంతే’’  అంటూ రాధిక  పేరెంట్స్‌ను ఊరడించారు.  

 

ఈ సందర్భంగా  హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే  ఏమిటో,  అమ్మాయిని లక్ష్మితో సమానంగా భావిస్తారంటూ కుమార్తె ప్రాముఖ్యత ఏంటో ప్రపంచ అతిథుల ముందు నీతా అంబానీ వివరించారు. దీంతో నూతన వధువు రాధిక, ఆమె తల్లితండ్రులతోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.

 నీతా అంబానీ వాగ్దానం
‘‘ముఖేష్‌, నేను మా కుమార్తెగా, అనంత్ సహచరిగా, ఇషా, ఆనంద్‌,, శ్లోక, ఆకాష్‌ మాదిరిగానే రాధికను కూడా  గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం, రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదాలకు మంచి అత్త, పిన్ని దొరికింది. నా ప్రియమైన రాధికను హృదయపూర్వకంగా మా ఇంట్లో అతి పిన్న వయస్కురాలిగా శ్రీమతి రాధిక అనంత్ అంబానీగా స్వాగతిస్తున్నాం’’ అంటూ చోటీ బహూను  అందరి కరతాళ ధ్వనుల మధ్య అంబానీ కుటుంబంలోకి  ఆమెను ఆహ్వానించారు.  జామ్‌ నగర్‌లో అనంత్‌ అంబానీ-రాధికకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న వీడియో నెట్టింట్‌ సందడి చేస్తోంది.

 కాగా  జూలై 12న అనంత్ అంబానీ  తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్‌తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.  ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 3 రోజుల పాటు వివాహ వేడుకలన్నీ అట్టహాసంగా జరిగాయి. అనంతరం అనంత్‌, రాధిక దంపతులకు శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం మంగళ్ ఉత్సవ్  లేదా  గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ  గ్రాండ్‌ వెడ్డింగ్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, దేశ విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)