Breaking News

ప్రిన్స్‌ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్‌

Published on Wed, 04/30/2025 - 14:57

ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle )  వివాహం  ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్‌ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు  బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్‌  తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం.  తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది.  ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం.  

2018, మే 19న  యూకేలోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  బ్రిటిష్ రాచరికంలో  సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత  ప్రిన్స్‌హ్యారీ, మేఘన్‌ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత  మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది.  

తన స్నేహితురాలు,  IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్‌కాస్ట్‌లో  ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్‌లో మేఘన్ మార్కెల్  మౌనం  వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది.  ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని  తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి  ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్‌తో సరదాగా  పోల్చారు.  తన భర్త ప్రిన్స్ హ్యారీ   చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి  చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి  ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన  పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.

అదే పాడ్‌కాస్ట్‌లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా  వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.

ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
 

‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో  సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల  డేటింగ్‌ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం  ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని  మేఘన్ మార్కెల్  చెప్పడం విశేషం.

2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి  తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్‌ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు  పిల్లలతో కలిసి  అమెరికాలో  ఉంటున్నారు.

చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)