Breaking News

రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!

Published on Sun, 09/07/2025 - 09:33

చాలామంది గర్భిణులు ప్రీఎక్లాంప్సియా సమస్యకు లోనవుతుంటారు. ఇప్పటి వరకు ఈ సమస్య వచ్చాక గుర్తించి, చికిత్స చేసే పద్ధతులే ఉన్నాయి తప్ప ముందుగా గుర్తించే పద్ధతులేవీ అందుబాటులో లేవు. అయితే, ఇటీవల స్పానిష్‌ వైద్య నిపుణులు ప్రీఎక్లాంప్సియాను నెలల ముందుగానే గుర్తించగల రక్తపరీక్ష విధానాన్ని కనుగొన్నారు. 

ప్రీఎక్లాంప్సియా సాధారణంగా గర్భిణుల్లో మొదటి ఇరవై వారాల తర్వాత తలెత్తుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం; మూత్రంలో ప్రొటీన్‌ పోవడం; శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల బరువు పెరగడం; ముఖంలోను, చేతుల్లోను వాపులు రావడం; వాంతులు, వికారం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

‘ప్లాస్మా సెల్‌ ఫ్రీ ఆర్‌న్‌ఏ’ (సీఎఫ్‌ఆర్‌ఎన్‌ఏ) రక్తపరీక్ష ద్వారా ప్రీఎక్లాంప్సియా వచ్చే అవకాశాలను నెలల ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షను స్పానిష్‌ వైద్య పరిశోధన సంస్థ ‘ఐప్రీమామ్‌’కు చెందిన టమారా గారిడో గోమెజ్‌ నేతృత్వంలోని వైద్య నిపుణులు రూపొందించారు. వీరు 2021–2024 మధ్య 9,586 మంది మహిళలకు ఈ రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైన ఫలితాలను సాధించారు. 
డాక్టర్‌ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)