Breaking News

అమ్మను కొంచెం యంగ్‌గా...

Published on Sat, 07/18/2026 - 07:42

చాలామంది తల్లిదండ్రులలో నాన్న యంగ్‌గా కనిపిస్తే... అమ్మేమో కొంచెం వయసు పైబడ్డట్లుగా కనిపించడం సహజం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా?

అమ్మానాన్నల వయసు దాదాపు ఒకటే. చె΄్పాలంటే సహజంగానే అమ్మకంటే నాన్నే వయసులో బాగా పెద్ద అయినా, చాలామందిలో నాన్నే యంగ్‌గా.. యాక్టివ్‌గా ఉంటే అమ్మలేమో కొంచెం పెద్దగా కనిపిస్తుంటారు. అందుకు వారి జీన్స్‌ ఒక్కటే కారణం కాదు. మహిళలలో ముందుగా వచ్చే మెనోపాజ్‌ కారణంగా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ కొంచెం వేగంగా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వయస్సులో ఈ మార్పులు త్వరగా కనిపించొచ్చు. 40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.

ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు మందగించడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా స్త్రీ శరీరాన్ని త్వరగా బలహీన పరిచే కారకాలు.

అన్నింటికన్నా ముఖ్యంగా... చాలా మంది మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భధారణ సమయంలో పోషకాలు తగ్గిపోవడం లాంటి కారణాలతో హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటారు. దాని ఫలితంగానే తొందరగా వయసు మీదపడ్డట్లు కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం, ఎముకల బలం కోసం విటమిన్‌ ఇ,సి,డి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి పోషకాలు తీసుకోవడం చాలా అవసరం.

ఉదాహరణకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం, కీర దోస, క్యాప్సికమ్, బ్రోకలీ, నారింజ, టమాటా లాంటి ఆహారాల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు, పనీర్, కేఫిర్, మజ్జిగ, ఇడ్లీ లాంటివి ఆరోగ్యకరమైన పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం అరుగుదల వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే యాంటీ బయాటిక్స్‌ వల్ల నాశనం అయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచడానికి ఇది సహాయపడుతుంది.

ఈ వయసులో అధిక రక్తపోటు ఎక్కువగా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. టేబుల్‌ ఉప్పు తక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాలు, కొత్తిమీర లాంటి సహజమైన మసాలాపదార్థాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. వారానికి కనీసం మూడు రోజుల పాటు బలం పెంచే వ్యాయామాలు చేయడం, యోగా, నడక లాంటి వ్యాయామాలు చేయడం వయసును నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం, మానసిక ఆరోగ్యం కోసం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సూచనలు పాటిస్తే అమ్మ కూడా నాన్న లాగే ఆరోగ్యంగా, యంగ్‌గా ఉటుంది.

అమ్మ యాక్టివ్‌గా ఉండాలంటే..?
వయసు పైబడ్డట్టు కనిపించే మాటెలా ఉన్నా... ఈ వయసులో వారు యాక్టివ్‌గా ఉండాలంటే మాత్రం వారి బరువుకు తగ్గట్టు రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రోటీన్‌ తీసుకోవాలి. ఇది ఎముకలు, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మూత్రపిండాల సమస్యలు తగ్గించడానికి దోహదం చేస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)