Breaking News

కలలో కూడా చూడని ఇల్లు..! చూశాక మాత్రం..

Published on Sun, 05/25/2025 - 09:56

ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్‌. అలాగే, కాలింగ్‌ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్‌ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్‌. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్‌లో మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్‌ వైజ్డ్‌ రిమాండ్‌ రూమ్స్‌ కూడా ఉన్నాయి. 

అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్‌లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్‌ డిస్కౌంట్‌ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్‌ రూమ్‌ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్‌ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు. 

కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్లస్‌ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్‌ పౌండ్స్‌ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్‌లాంగ్‌ లాకప్‌కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి!  

(చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్‌ తెలిస్తే షాకవ్వుతారు..)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)