Breaking News

లాఠీ పట్టుకుని బోర్‌ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని..

Published on Sun, 08/06/2023 - 08:34

కాసేపు లాఠీని పక్కనపెట్టి గరిటను పట్టుకుందాం అనుకుని కేరళలోని ఒక పోలీస్‌ స్టేషన్‌ వారు ఈ వానల్లో వేడివేడిగా వంట చేశారు. వీడియో కూడా తీశారు. వాళ్లు లొట్టలేసుకు తింటుంటే నెటిజన్లు‘ఈ మాత్రం కళాపోషణ’ ఉండాలి అని మెచ్చుకున్నారు. కాని పోలీసు బాసులు మాత్రం వేరొకటి తలచారు. ఏమా వంట? ఏమా వైరల్‌?

ఆ పోలీసులు ఇంట్లో వంట చేసుకుని ఉంటే బాగుండు. కాని వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందో ఏమో, కొంచెం బోర్‌ను బ్రేక్‌ చేద్దాం అనుకున్నారో ఏమో ఏకంగా స్టేషన్‌లోనే వంట చేశారు. ఆ చేయడం వీడియోలో షూట్‌ చేసి ఇన్‌స్టాలో పెట్టారు. చూసిన జనం ఈ మాత్రం సర్దా ఉండాల్లే అని ముచ్చట పడితే పోలీసు బాసులు మాత్రం కయ్యిమన్నారు. అసలేం జరిగిందంటే కేరళలోని ఇలవుంతిట్ట అనే స్టేషన్‌లో పోలీసులు వంట చేసుకు తిన్నారు.

చికెన్‌ని తేవడం, ముక్కలు కొట్టించడం, కూర చేయడం, మటన్‌ కూర, దాంతో పాటు చిలగడదుంపల సంగటి కెమెరా ముందు అద్భుతంగా వండారు. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చి స్టేషన్‌ ఎస్‌.ఐతో పాటు అందరూ ఆరగించారు. దానికి మంచి పాట జత చేశారు. వీడియో సోషల్‌ మీడియాలో వదిలారు. ఇంకేముంది... జనం రకరకాల సరదా కామెంట్‌లు చేశారు.

‘అప్పుడప్పుడు తినండోయ్‌... ఎప్పుడూ డ్యూటీయేనా’ అన్నారు. కాని ఈ వీడియో పోలీస్‌ బాస్‌ల కంట పడింది. ఆ ఏరియా ఐ.జి ‘ఈ విధంగా డ్యూటీలో వండుకు తినడం ఏ విధంగా విధులకు భంగకరం కాదో’ వివరణ ఇమ్మని ఆదేశించాడు. మరి ఐ.జి గారికి ఎక్సప్లనేషనే పంపుతారో ఇంకో కూర వండి కూల్‌ చేస్తారో తెలియదు. 

(చదవండి: వాట్‌ యాన్‌ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!)

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు