Breaking News

మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..

Published on Tue, 04/21/2026 - 12:03

బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్‌మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్‌గ్రామ్‌ జిల్లాలో మోదీ కాన్వాయ్‌ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్‌మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్‌’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్‌ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చిరుతిండి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వంటకానికి యావత్తు భారతదేశంలో ప్రజలంతా చేసుకుంటారు. కాకపోతే ఆయా ప్రాంతాల వారీగా పలుల పేర్లు ఉన్నాయంతే. కానీ దీని రుచికి అందరు ఫిదా అనే చెప్పాలి. విదేశీయలు సైతం అబ్బా అని లొట్టలేసుకుంటూ తినేలా చేసే స్నాక్‌ ఐటెం ఇది. మరి నోరూరించే ఈ ఝల్‌మురి వంటకాల కహానీ గురించి సవివరంగా చూద్దామా..!.

ఝల్‌మురి అంటే..
కోల్‌కతా స్ట్రీట్‌ చిరుతిండి ఇది. మరమరాలు, ఆవనూనె, మసాలాలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగుళ్లు, సెనగపప్పులు వేసి కమ్మగా, కారంగా చేసే వంటకం. ఇది ఏమి స్టవ్‌ వెలిగించే చేసే వంటకం కాదు. ఇది మొత్తం పదార్థాలు కలపడం పైనే రుచి ఆధాపడి ఉంటుంది. 
ఆ పేరు ఎలా వచ్చిందంటే..
బెంగాలీలో “ఝల్” అంటే కారం, “మురి” అంటే మరమరాలు. ఈ రెండింటినీ కలిపితే,కారం కారం మరమరాలు అని అర్థం. అమ్మకందారులు స్టీల్‌ పాత్రలలో దీన్ని కలుపుతూ..పదార్థాలను గాల్లోకి ఎగరువేస్తూ..కోన్‌ల వార్తాపత్రికలను చుట్టి సర్వ్‌ చేస్తుంటారు. చవకైనది..మనసుకు ఆహ్లాదాన్ని, కాలక్షేపాన్ని ఇచ్చే చిరుతిండి ఇది. 

వలసవాద కాలంలో బెంగాల్‌లో ఉద్భవించిందని చెబుతుంటారు. మాములు చిరుతిండిగా మొదలైన రైళ్లలో, బీచ్‌లలో, కళాశాల ప్రాంగణాలలో విరివిగా అమ్ముతుంటారు. ఇంకా పెద్ద పెద్ద కేఫ్‌లు సైతం లభిస్తోంది. ఈ స్ట్రీట్‌ భారతదేశమంతటా ఫేమస్‌. పైగా ఆయా ప్రాంతాల వారీగా పలు రకాలుగా పిలుస్తారు. చేసే విధానం ఒక్కటే. మరి ఆ పేర్లేంటో చూసేద్దామా..! 

ఇన్ని పేర్లా..?!
ముంబైలో దీన్ని భేల్‌పురిగా తీపి కారంల కలయికతో తయారు చేస్తారు. ఇక  బెంగళూరు చురుమురిలో తురిమిన కొబ్బరితో దక్షిణ భారత రుచితో మిళితం చస్తారు. ఒడిశాలో మసాల మురిగా..అందులో అన్ని ఎక్కువ పదార్థాలు జోడించనప్పటికీ ఘాటుగా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలో ముంతమసాల, పిడతకింద పప్పు, ఉగ్గాణి వంటి పేర్లోతో పిలుస్తారు.

ముంతమసాల: రమరాలు, మసాలా దినుసులు, వేరుశెనగ గుళ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు తదితరాలను కలిపి గిన్నెలో ఇస్తారు కాబట్టి ముంత మసాల. అంటే ఇక్కడ ఒక చిన్న అల్యూమినియం ముంతలో (గిన్నె)లో సర్వ్‌ చేస్తారు. ఇది కోస్తాంధ్ర, రాయలసీమలో సాయంత్రం వేళల్లో దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్.

పిడతకింద పప్పు: ఇది కూడా ముంతమసాల లాంటిదే, కానీ ఇందులో మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా చేసి కలుపుతారు. అలాగే మరమరాలు మెత్త బడకుండా చిన్న మట్టి కుండలో నిప్పులు వేసి మరమరాలపై ఉంచుతారు అందువల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఇది ముఖ్యంగా కోస్తాంధ్ర (గుంటూరు, కృష్ణా జిల్లాలు) లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఉగ్గాణి
మరమరాలను నీటిలో నానబెట్టి, తాలింపు పెట్టి చేసే ఒక రకమైన తడి మిశ్రమం. దీనికి పసుపు, వేరుశెనగ గుళ్లు, పుట్నాల పొడి (పుట్నాల పప్పు పొడి) ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా మిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, అందుకే దీనిని 'ఉగ్గాణి బజ్జీ' అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో (కర్నూలు, అనంతపురం) ఇది చాలా ఫేమస్. అక్కడ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తింటారట. 

ఆరోగ్యదాయకం కూడా..
ఈ మరమరాలతో తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యప్రదం కూడా. ఎందుకంటే ఇందులో ఆయిల్‌ కంటెంట్‌ తక్కువ. పైగా అన్ని నేచురల్‌గా కలిపేస్తారు. ఇక్కడ డీప్‌ఫ్రైకి ఛాన్స్‌లేదు. టమటా, ఉల్లిపాయలు నుంచి అన్ని కూడా పచ్చిగానే కలుపుతారు. ఒకరకంగా సలాడ్‌ మాదిరి ఐటెం. కాకపోతే కాస్త మరమరాలతో రుచికరంగా మారుతుంది. 

పైగా వెయిట్‌లాస్‌ స్నాక్‌ ఐటెం అని అంటున్నారు. ఇది కడుపు నిండిన అనుభూతితోపాటు మనసుకు హాయినిచ్చే స్నాక్‌ ఐటెం అట. ఇక మరమరాల్లో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని అంటున్నారు. పైగా తేలిగ్గా అరిగిపోతుంది కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఫైబర్‌ తోపాటు, సులువుగా జీర్ణమయ్యే బలవర్ధకమైన చిరుతిండి అట. 

 

 

Videos

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు

Photos

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)