Breaking News

ఫ్లైట్‌ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!

Published on Fri, 03/06/2026 - 13:45

కొందరు భలే విచిత్రంగా ఉంటారు. ఒక్కరోజు వర్కౌట్లు మిస్సైతేనే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా లబోదిబోమంటారు. ఎలా ఉన్నా..ఎక్కడ ఉన్నా..టెన్షన్‌గా వ్యాయామాలు చేసేయాల్సిందే. అందుకోసం ఏం చేసేందుకైనా, ఎంత కష్టమైనా డోంట్‌ కేర్‌. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఈ టైపే. అయితే ఈ వ్యక్తి ఫిట్‌నెస్‌ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో చూస్తే..ఓర్నీ గాల్లో కూడానా. అంటారు.

ఇంతకీ ఏం చేశాడంటే..బెర్లిన్‌కు చెందిన ఎండ్యూరెన్స్ అథ్లెట్, కంటెంట్‌  క్రియేటర్‌ డోమ్‌ స్ట్రోహ్‌..ఫ్లైట్‌లో దాదాపు పదకొండు గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో చాలా గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. కనీస కదలికలు కాస్త కష్టమే. అందువల్ల మనోడు ఎక్కడ ఆరోగ్యం పాడవ్వుతుందని అనుకున్నాడో ఏమో గానీ. ఎలాగైనా..ఈ పరిస్థితుల్లో కూడా తన ఫిట్‌నెస్‌ని కాపాడు కోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యాడు. 

అందుకని ఏకంగా ఫ్లైట్‌లో ఉండే టాయిలెట్‌నే జిమ్‌గా మార్చేశాడు. విమానంలో సాధారణంగా వాష్‌రూమ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. అంత ఇరుకైనా వాష్‌ రూమ్‌లో మనోడు ఏకంగా 5కే రన్‌ పూర్తి చేసే సాహసం చేశాడు. అసలు మనిషి ఒక్కడే పట్టేంత స్థలంలో వాకింగ్‌ అనేదే సాధ్యం కాదు..కానీ డోమ్‌ ఏకంగా రన్‌ చేయాలనుకుంటున్నాడు. ఎలా చేశాడో కూడా అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశాడు డోమ్‌. 

అంతేకాదండోయ్‌ నిజంగానే 5.5 కిలోమీటర్లు రన్‌చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మనిషి అటు ఇటు కదలడానికి ఏ మాత్రం చోటు లేని ఆ చిన్న బాత్రూమ్‌లో మనోడు అంత వర్కౌట్‌ పూర్తి చేశాడా..? అని ఆశ్చర్యం కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం డోమ్‌ ఆ స్టంట్‌ ఎలా పూర్తిచేశాడో చూసేయండి మరి..!. నెటిజన్లు కూడా మీరొక్కరే బాత్రూంలో అంతసేపు ఉండిపోయి..ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టారో ఏంటో అని కొందరు. పాపం గాల్లో స్టంట్‌ చేయాలనుకున్నాడు కాబోలు అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్‌’)

 

#

Tags : 1

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు