Breaking News

Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్‌ వాక్‌!

Published on Fri, 01/31/2025 - 17:27

పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లోభారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖుడైన డిజైనర్‌ గౌరవ్‌గుప్తా ప్రత్యేక కలెక్షన్‌తో అలరించాడు. ఢిల్లీకి చెందిన ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్  జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్నే థీమ్ గా మల్చుకుని  ఫ్యాషన్‌ వీక్‌లో తన దుస్తులను  ప్రదర్శించాడు.  భార్య నవ్‌కిరత్ సోధి అగ్ని ప్రమాదాన్నే  'అక్రాస్ ది ఫైర్' థీమ్ గా  కోచర్ కలెక్షన్‌ను ప్రదర్శించాడు.  పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా కలెక్షన్‌కు వ్యక్తిగత విషాదం ఎలా ప్రేరణనిచ్చింది  తెలుసుకుందాం.

ఒక చిన్న కొవ్వొత్తి గౌరవ్‌, నవ్‌కిరత్‌ జీవితాలను పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది నెలల క్రితం అనుకోకుండా  జరిగిన ఈ  ప్రమాదంలో గౌరవ్ గుప్తా భార్య నవ్‌కిరత్  దాదాపు మరణానికి చేరువైంది.  ఆమె శరీరం 55 శాతం కాలిపోయింది.  ఆమె బతికే అవకాశం 50 శాతం అని వైద్యులు చెప్పారు. అయినా నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విజేతగా నిలిచింది. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించి  గౌరవ్  కూడా గాయపడ్డాడు. ఢిల్లీలోని  అటెలియర్ ధ్వంసమైంది.  కొంత ఆస్తినష్టం కూడా జరిగింది. 

కట్‌ చేస్తే..మొక్కవోని ధైర్యంతో, అద్భతమైన కలెక్షన్‌తో ప్యాషన్‌వీక్‌లో అబ్బుర పర్చారు. ఈ ప్రమాదం కారణంగానే గత సంవత్సరం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా  పాల్గొనలేకపోయాడు. కానీ  ఈ సారి వేగంగా  పుంజుకని  తన  స్టైల్‌తో అందరి అంచనాలను మించిపోయాడే. తన జీవితభాగస్వామి నవ్‌కిరత్ సోధి ద్వారా 2025 ఫ్యాషన్‌ వీక్‌ పూర్తి న్యాయం చేశాడని ఫ్యాషన్‌ నిపుణులు కొనియాడటం గమనార్హం. (కీర్తి సురేష్‌ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్‌)

ఈ ఈవెంట్‌లో నవ్‌కిరత్ సోధి ప్రత్యేకంగా నిలిచింది. క్రీమ్-హ్యూడ్ డ్రెప్డ్ కార్సెట్ గౌనులో రన్‌వేపై వాక్‌ చేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై కాలిన గాయాల తాలూకు మచ్చలు కనిపించినపుడు అందరి కళ్లు గౌరవా భిమానాలతో చెమర్చాయి. నవకిరత్ కేవలం కలెక్షన్‌ను ప్రేరేపించడమే కాదు. ఆమె ఫీనిక్స్‌ పక్షిలా తిరిగి లేచి సాధికారత క్షణాలను ప్రపంచానికి  చూపించి ప్రశంసలు అందుకుంది. 

 "ఆమె ఒక పోరాట యోధురాలు . ప్రాణాలతో బయటపడినది... ఆమె ఒక దేవత" అని గౌరవ్ తన అధికారిక పేజీలో షేర్ చేసిన భావోద్వేగ వీడియోలో  పేర్కొన్నాడు. నవ్‌కిరత్ సుదీర్ఘ  ప్రయాణం తమ జీవితాలను మార్చడమే కాకుండా, ఒక సృజనాత్మక దృష్టిని మిగిల్చిందన్నాడు.

 

దేశీయంగా అంతర్జాతీయ A-లిస్టెడ్ ఫ్యాషన్ డిజైనర్‌ గౌరవ్‌గుప్తా.  తాజా ప్యారిస్‌  ఫ్యాషన్‌ వీక్‌  ఈవెంట్‌లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించాడు. జర్డోజీ, డబ్కా , నక్షి లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ ఎక్కువ. రాహుల్ మిశ్రా ,వైశాలి ఎస్ తర్వాత ఈ కోచర్ వీక్‌లో ప్రజంట్ చేస్తున్న మూడవ డిజైనర్ గౌరవ్ గుప్తా కావడం విశేషం. 

  • 2004లో, అతను తన సోదరుడు సౌరభ్ గుప్తాతో కలిసి తన  లేబుల్‌ని స్థాపించాడు.  తరువాత ఇస్తాంబుల్‌లోని ఒక కంపెనీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.  చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి, 2006లో అధికారికంగా తన లేబుల్‌ను ప్రారంభించాడు.
  • 2006లో ఇండియా ఫ్యాషన్ వీక్‌లో "అత్యంత వినూత్న ప్రదర్శన"గా  ప్రశంసలందుకున్నాడు.
    2009లో, తన తొలి  స్టోర్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించాడు.  ముంబై,హైదరాబాద్‌, కోల్‌కతా లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో అతని ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లున్నాయి.
  • 2017లో, భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత వస్త్రాన్ని రూపొందించడానికి గౌరవ్ వోగ్ IBM  కాగ్నిటివ్ సిస్టమ్ వాట్సన్‌తో కలిసి పనిచేశాడు. 
  • 2022లో, గౌరవ్ గుప్తా బ్రైడ్ - పెళ్లి దుస్తుల్లోకి ప్రవేశించాడు. లిజ్జో, మేగాన్ థీ స్టాలియన్ , దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా , మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, సావీటీ, థాలియా, కైలీ మినోచ్యుల్, వయోలెట్, ఒలిట్వియా, ఒలిట్వియా లాంటివి దేశవిదేశాల్లో ప్రజాదరణ పొందాయి. 
  • 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం డిజైన్‌ చేసిన దుస్తులు హైలైట్‌ అయ్యాయి.
  • 2023లో జరిగిన పారిస్ హాట్ కోచర్ వీక్‌లో గౌరవ్ గుప్తా డిజైన్‌ చేసిన అద్భుతమైన లెమన్ గ్రీన్ గౌనును అమెరికన్ రాపర్ కార్డి బి,చైనీస్ నటుడు ఫ్యాన్ బింగ్‌బింగ్  ధరించడం విశేషం. 
    ఇదీ చదవండి : పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్‌ అదుర్స్‌


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)