Breaking News

చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!

Published on Thu, 04/16/2026 - 15:18

ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్‌లోకి జంక్‌ ఫుడ్‌ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్‌లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్‌ ఫుడ్‌ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  

ఎదుగుదలకు హానికరం 
చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్‌ ఫుడ్స్‌ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. 

దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్‌ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్‌ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్‌ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి.  

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి 
చిన్నారులకు జంక్‌ ఫుడ్‌ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. 

అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.

అవగాహన కల్పిస్తున్నాం 
పోషణ్‌ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్‌ ఫుడ్‌ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల     ఉంటుంది.  
– విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి 

జంక్‌ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు 
జంక్‌ ఫుడ్‌ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్‌ఫుడ్‌ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  
– బీఆర్‌కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రి

సంప్రదాయ ఆహారంతో మేలు
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్‌ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు,  అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్‌తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి.   

(చదవండి: మామ్‌ వెయిట్‌లాస్‌ జర్నీ..! నో క్రాష్‌ డైట్‌, నో స్ట్రిక్ట్‌ రూల్స్‌..ఏకంగా 22 కేజీలు..)

Videos

"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!

Breaking News: పూడి శ్రీహరికి బెయిల్

BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం

Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు

వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్

హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు

LIVE:లష్కరే టాప్‌ కమాండర్‌పై కాల్పులు...

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

Photos

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)