30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!

Published on Tue, 06/16/2026 - 09:31

చాలామంది వృద్ధాప్యం వచ్చాకే శరీరం బలహీనపడుతుందని భావిస్తారు. కానీ కండరాల బలం తగ్గే ప్రక్రియ 30 ఏళ్ల తర్వాతే నెమ్మదిగా ప్రారంభమవుతుంది. 60 ఏళ్లు దాటాక ఇది మరింత వేగంగా సాగుతుంది. ఫలితంగా శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, తరచూ పడిపోవడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతాయి. అంటే సమస్య వయసు కాదు.. వయసుతో పాటు తగ్గిపోతున్న కండరాల బలమే అని నిపుణులు చెబుతున్నారు.

వయసు పెరుగుతోందంటే వెంట్రుకలు తెల్లబడటం, ముడతలు పడటమే కాదు. మీకు తెలియకుండానే శరీరంలోని కండరాలు కూడా క్రమంగా బలహీనపడుతున్నాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యే ఈ ప్రక్రియను పట్టించుకోకపోతే.. 60, 70 ఏళ్ల వయసులో మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం, రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.

నడక ఒక్కటే సరిపోదంట: ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడిస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కండరాల బలాన్ని కాపాడుకోవడానికి మాత్రం స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కుర్చీ నుంచి లేచి కూర్చోవడం, స్క్వాట్స్‌, గోడకు ఆనుకుని పుష్‌అప్స్‌ చేయడం, మెట్లు ఎక్కడం, రెసిస్టెన్స్‌ బ్యాండ్లతో చేసే వ్యాయామాలు కూడా కండరాలను బలోపేతం చేస్తాయి.

మొదట్లోనే అతి వద్దు: అయితే ఒక్కసారిగా ఎక్కువ వ్యాయామం చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు రోజులు, రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు. శరీరం అలవాటు పడిన తర్వాత క్రమంగా తీవ్రత పెంచాలని చెబుతున్నారు.

కండరాలు బలపడితే: స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వల్ల కేవలం కండరాలే కాదు.. ఎముకలు కూడా బలపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

50.. 60.. 70 వచ్చినా.. డోంట్‌ వర్రీ: "ఇప్పుడేం ఉపయోగం?" అని అనుకునేవారికి నిపుణులు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. కండరాల బలాన్ని పెంచుకోవడానికి వయసు అడ్డంకి కాదని చెబుతున్నారు. 50, 60, 70 ఏళ్ల వయసులో కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు.

వ్యాయామంతో పాటు: కండరాల నిర్మాణానికి ప్రోటీన్‌ చాలా అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, చేపలు, మాంసాహారం వంటి ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం తర్వాత సరైన విశ్రాంతి కూడా అవసరమే. ఎందుకంటే కండరాలు వ్యాయామం చేసే సమయంలో కాకుండా.. విశ్రాంతి సమయంలోనే మరింత బలపడతాయి.

వయసు పెరగడం ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ వయసు పెరిగాక ఎంత చురుకుగా, ఎంత స్వతంత్రంగా జీవించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే 30 దాటిందంటే నిర్లక్ష్యం చేయొద్దు. మీ శరీరంలోని కండరాలు నిశ్శబ్దంగా బలహీనపడకముందే అప్రమత్తం కావాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ మొదలుపెట్టకపోతే.. వృద్ధాప్యంలో మూల్యం చెల్లించాల్సి రావచ్చని స్పష్టం చేస్తున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)