Breaking News

ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?

Published on Sun, 02/09/2025 - 14:56

కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..

పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. 

కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్‌ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులు

  • బరువు తగ్గించే జర్నీలో డైట్‌ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.

  • అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. 

  • ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్‌లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. 

  • హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్‌ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. 

  • దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. 

  • పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. 

  • అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.

(చదవండి: యంగ్‌ లుక్‌ మంచిదే!)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)