Breaking News

గుజరాత్‌ వరదలు : ‘‘బతకడానికి ఇంకేం మిగల్లేదు’’!

Published on Thu, 08/29/2024 - 13:46

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేశాయి. వడోదర  సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవితం అస్తవ్యస్తమైంది గాంధీనగర్, ఖేడా, వడోదర తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటికే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 18వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 30 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  అంతేకాదు 15 అడుగుల పొడవైన మొసళ్లు ఇళ్లల్లోకి చొరబడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

వడోదర నివాసి  ఆవేదన గుజరాత్‌ వర్షభీభత్సానికి అద్దం పట్టింది. వరద ఉదృతికి  విలువైన మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయంటూ  ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు..   ఇక బతకడానికి ఏమీ మిగల్లేదు అంటూ తన బాధను పంచుకున్నాడు.   దీనికి సంబంధించి నీట మునిగిన తన  మూడు కార్ల ఫోటోలను  రెడ్డిట్ యాప్‌లో షేర్‌ చేశాడు. పోస్ట్ ప్రకారం,  50 లక్షల రూపాయల విలువైన  ఖరీదైన కారు ఆడి ఏ6,మారుతి సుజుకి సియాజ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.


అయితే వీధిలో పార్క్ చేయడం వల్లే ఇలా జరగిందన్న  నెటిజన్లు వ్యాఖ్యలకు స్పందించిన ఆయన మరింత వివరంగా తన దుస్థితిని వివరించాడు.  తాను 5 BHK బంగ్లాలో ఉంటాననీ 85 ఇళ్లు ఉన్న సొసైటీలో, ప్రతీ ఇంటికి 3 కార్ పార్కింగ్‌లు ఉంటాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ  నీట మునిగాయని , తన  ఇంట్లోకి 7 అంగుళాలు, బయట దాదాపు 4 అడుగుల నీరు చేరిందని తెలిపారు. దీంతో నెటిజన్లు సానుభూతి  ప్రకటించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)