Breaking News

వాళ్లకి బ్రెయిన్‌ అవసరం లేదట : హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ వైరల్‌

Published on Sat, 07/26/2025 - 14:23

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గొయెంకా (Harsh Goenka)ఎక్స్‌లో  మరో ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ చేశారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింప చేసే ఆయన తాజా ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.  యూకే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక గ్లోబల్ CEO భారతీయ నిపుణుల మేధో సామర్థ్యాలను ఎలా అవమానించారో తెలుపుతూ ట్వీట్‌ చేశారు.  అందుకే నిపుణులంతా భారతీయ కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారంటూ చురకలంటించారు. హర్ష్ గోయెంకా ట్వీట్‌  ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.
 

హర్ష్‌గోయెంకా ట్వీట్‌: "భారతీయ అనుబంధ సంస్థ, అత్యంత ప్రగతిశీల సంస్థకు చెందిన గ్లోబల్ CEO నాతో ఇలా అన్నాడు. ‘‘బ్రెయిన్‌, చేతులు, కాళ్లు అవసరం లేకుండా కేవలం ప్లాన్‌ను అమలు చేసే ఇంజీన్‌లా నా భారతీయ CEO    ఉండాలని కోరుకుంటా.. అని అన్నట్టు అని గోయెంకా గుర్తు చేసుకున్నారు. "ఈ విధానం వల్లే ఇప్పుడు  భారతీయ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు " అని ఆయన  పేర్కొన్నారు.

ఈపోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. ముఖ్యంగా, భారతీయ సంతతికి చెందిన  టెక్‌ నిపుణులు ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు, నూతన ఆవిష్కరణలతో టాప్‌లో కంపెనీలను నడిపిస్తున్న తరుణంలో  హర్ష్‌ గోయెంకా ట్వీట్‌  విశేషంగా నిలిచింది.

"సో నయా వలసవాద వైఖరులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నది నిజమన్నమాట అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఈ మనస్తత్వం వల్లే భారతీయ నిపుణులు స్వదేశీ కంపెనీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.  మెషీన్లలా పనిచేయం కాదు...మెదళ్ళకు విలువ ఇవ్వాలనుకుంటున్నాము" అని మరొకరు రాశారు.

చదవండి : కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!

బెన్‌హాన్స్ ఫార్మా MD ఎలియా జయరాజ్, “భారత జట్టును చేతులు, కాళ్ళు లేకుండా చేయాలనే UK CEO ప్లానా ఇది?  ఒక క్రికెట్ స్టార్‌ను బంతిని అలా ఫెచ్‌   చేయమని అడిగినంత  కామెడీగా ఉంది.  TCS వంటి భారతీయ సంస్థల వైపు  ఐటీ నిపుణులు పరిగెత్తడంలో ఆశ్చర్యం లేదు , అక్కడ వారు తమ తెలివితేటలను ప్రదర్శించగలరు. 2024లో రిటెన్షన్‌ (ఉద్యోగుల కొనసాగింపు) 10 శాతం బెటర్‌గా ఉందని నాస్కామ్ చెబుతోంది. భారతీయ CEOలు  అవకాశాన్ని  వాడుకోండి.. లేదంటే మీకు నష్టం  అని  వ్యాఖ్యానించారు. 

“ఇది  బహుశా ఫార్మా లేదా ఆర్థిక సేవల సంస్థ అయి ఉండాలి. మరే ఇతర రంగంలోనూ బ్రిటీషోళ్లకి అంత సీను లేదు” అని  మరొకరు కమెంట్‌ చేశారు. 
ఇది చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)